నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న షో అన్‌స్టాపబుల్ 2. ఆహా వేదికగా ప్రసారం అవుతున్న ఈ షోలో రీసెంట్‌గా డార్లింగ్ ప్రభాస్ సందడి చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులు ప్రభాస్‌కు సంబంధించిన ఎపిసోడ్ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ గురువారం(డిసెంబర్ 29న) ఆహాలో ప్రసారమైంది. ఈ సందర్భంగా ప్రభాస్ తన సినిమా విశేషాలు, డేటింగ్ రూమర్స్, పర్సనల్ లైఫ్ గురించిన ఎన్నో ఆసక్తిర విషయాలను పంచుకున్నాడు.
చదవండి: రొమంటిక్ సీన్స్‌లో హీరోల ప్రవర్తన అలా ఉంటుంది: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ క్రమంలో రాజమౌళితో బాహుబలి చిత్రంపై బాలయ్య ప్రభాస్‌ను ప్రశ్నించాడు. ఛత్రపతి సినిమాతోనే రాజమౌళి గురించి తెలుసుండాలి కదా? అయినా బుద్ది రాలేదా? మళ్లీ ఆయనతో బాహుబలి సినిమా చేశావు? అంటూ చమత్కరించాడు. దీనికి ప్రభాస్ స్పందిస్తూ.. ‘‘ఛత్రపతి’ సినిమాతోనే రాజమౌళి గారి గురించి నాకు తెలిసిపోయింది. ఆయన విషయంలో నాకు అనుభవం ఉంది. కానీ, రానాకే అప్పటికి ఇంకా ఏం తెలియదు. బాహుబలి మేం ఫైనల్ అయ్యాక రాజమౌళి అంటే ఏంటో చెప్పాను. ఇక ‘మనవాడు కాస్త ఫుట్ బాల్ ఆడుకుంటాడు’ అని షూటింగ్‌కి ముందే నేను రానాకి చెప్పాను.
చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ బట్టర్‌ఫ్లై మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
కాకపోతే అలాంటి సినిమాలో మళ్లీ మళ్లీ ఛాన్స్ రాదు కాబట్టి బాహుబలి సినిమా చేశాను. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఛత్రపతి’ సినిమా షూటింగు మొదలైన నాలుగు రోజులకే రాజమౌళిగారు చాలా గొప్ప మనిషి అనే విషయం నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను ఆయనకి మంచి స్నేహితుడినైపోయాను. ఆ సినిమా విరామ సన్నివేశాలు షూట్ చేసేటప్పుడు సెట్ మొత్తం జనాలు. వాళ్లందరి ముందు డైలాగ్ చెప్పడానికి సిగ్గుగా అనిపించింది. అదే విషయాన్ని జక్కన్నతో చెప్పి ఈ సీన్ వరకూ మూకీగా యాక్ట్ చేశాను. అక్కడ ఉన్న వాళ్లందరూ రిహార్సల్స్ అనుకున్నారు. అలా జక్కన్న నేను ఏది అంటే అది చేసే ఫ్రీడమ్ ఇచ్చారు’’ అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment