డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ ఉన్న సంగతి తెలిసిందే. రేపు(మార్చి 11) ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో వారం ముందుగా మూవీ ప్రమోషన్లో పాల్గొంటున్న ప్రభాస్ ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా రాజమౌళి డైరెక్షన్‌లో తాను తొలిసారి నటించిన చత్రపతి మూవీలో ఆర్ట్ డైరెక్టర్ చేసిన ఓ పనిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
చదవండి: సమంతపై దారుణమైన ట్రోల్స్.. చీచీ ఇలా దిగజారిపోతున్నావేంటి?
కాగా ఈ మూవీకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ రవిందర్.. రాధేశ్యామ్‌కు కూడా పని చేశాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ చత్రపతిలో ఆర్ట్ డైరెక్టర్ రవిందర్ చేసిన పనిని గుర్తు చేసుకున్నాడు. చత్రపతిలో సముద్రం ఒడ్డున ప్రభాస్ విలన్ కాట్రాజ్‌ల ఫైట్ సీన్ ది బెస్ట్ యాక్షన్ సీన్‌గా నిలిచింది. ఈ సన్నివేశంలో ప్రభాస్‌ను విలన్ కర్రతో కోడతాడు. దీని కోసం విలన్ కాట్రాజ్‌కు సముద్రం ఉప్పుతో చేసిన నిజమైన కర్రను ఇచ్చారట. కానీ ఈ విషయం ప్రభాస్‌కు, విలన్ సుప్రిత్‌కు తెలియదు. దీంతో విలన్ సుప్రీత్ డూప్ కర్ర అనుకుని తన వీపుపై గట్టిగా కొట్టాడని చెప్పాడు.
చదవండి: నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా: మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
దాంతో తన వీపు పగిలిపోయిందంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు ప్రభాస్. అయితే ఇదే విషయాన్ని ఆర్ట్ డైరెక్టర్ రవిందర్‌ను అడగ్గా.. పర్ఫెక్షన్ కోసం అంటూ సమాధానం ఇచ్చాడట. కాగా 2005లో రాజమౌళి డైరెక్షన్ వచ్చిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. అప్పట్లోనే ఈ మూవీ రూ. 27 కోట్లు వరకు షేర్ వసూలు చేసిందట. అప్పటి వరకు లవర్ భాయ్‌గా కనిపించిన ప్రభాస్‌కు చత్రపతితో మాస్ ఇమేజ్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment