బెల్లంకొండ: గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం వద్ద రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పాపాయిపాలెంకు చెందిన ఎన్. బ్రహ్మయ్య బైక్‌పై బెల్లంకొండ నుంచి స్వగ్రామానికి వస్తుండగా... ఎదురుగా మరో బైక్‌పై వస్తున్న వెంకటరావు ఢీకొన్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో బ్రహ్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వెంకటరావును సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.