
తమిళసినిమా: వర్ధమాన నటీమణులకు నటి రెజీనా ఇచ్చిన సలహా ఏమిటో తెలుసా? అది తెలుసుకోవాలంటే ముందు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే రెజీనా సలహాకు దీనికి సంబంధం ఉంది. కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో కాస్టింగ్‌కౌచ్ వదంతం కలకలాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. చాలా మంది ఈ కాస్టింగ్ కౌచ్ బాధితులేనని ఒక్కొక్కరూ ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. దీని గురించి నటి రెజీనా ఏమంటుందో చూద్దాం. కాస్టింగ్ కౌచ్, అమెరికాలో అమ్మాయిల వ్యభిచారం సంఘటనలు కొద్ది కాలంగా అధికం చర్చ జరుగుతోంది. ఇలాంటి వార్తలకు ప్రాధాన్యత నివ్వకుండడమే మంచిదని నేను భావిస్తున్నాను. నిజంగా అలాంటి ప్రచారంలో వాస్తవాలు ఉంటే ఏదో ఒక రోజున చర్యలు తీసుకోవలసిందే.
దీని గురించి నేనేమైనా స్పందిస్తే దాన్ని వేరేగా చిత్రీకరిస్తారు. ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం ఏముంటుంది. కొందరు తమకు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతారు. అలాంటి వాటిలో ఏది నిజం అన్నది మీడియా నిర్ధారించుకుని ప్రసారం చేయాలి. ఎందుకంటే మీడియా ప్రసారాలను నమ్మేవారు చాలా మంది ఉంటారు. అందుకే ఇలాంటి వ్యవహారాల గురించి ప్రసారం చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలి. ఇలాంటి సంఘటనల నుంచి వర్ధమాన తారలు పాఠం నేర్చుకుని వాటికి దూరంగా ఉండాలన్నదే నా సలహా అంటున్న రెజీనా తాజాగా కోలీవుడ్‌లో నటించిన చిత్రం మిస్టర్ చంద్రమౌళిపై చాలా ఆశలు పెట్టుకుంది. అందులో గ్లామర్‌ను నమ్ముకుని అందాలారబోతలో విరగదీసింది. అయినా చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో ఈ అమ్మడు డీలా పడిపోయింది.