
దిలీప్ ప్రకాశ్, రెజీనా కసాండ్రా
రెజీనా కసాండ్రా, దిలీప్ ప్రకాశ్ జంటగా నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు మేకర్స్. ‘ఫస్ట్ కిస్..’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేసింది యూనిట్.
చిత్ర సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా రామ్ మిరియాల పాడారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘ఉత్సవం’ రూపొందింది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ‘ఫస్ట్ కిస్..’ పాట యువతను ఆకట్టుకుంటుంది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులందరూ చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment