utsavam
-
‘ఉత్సవం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్.. ట్రైలర్ వచ్చేసింది!
దిలీప్ ప్రకాశ్, రెజీనా జంటగా నటించిన తాజా చిత్రం ఉత్సవం. ఈ సినిమాకు అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్ పిక్చర్స్ బ్యానర్‌పై సురేశ్ పాటిల్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రంగస్థల నాటకం ప్రధాన అంశంగా ఈ మూవీని రూపొందించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్లో లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూస్తుంటే ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా.. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మనందం, ప్రకాశ్ రాజ్, నాజర్, అలీ, ఎల్బీ శ్రీరామ్, అనీశ్, ఆమని, సుధా, ప్రియదర్శి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
Utsavam Movie: ఆకట్టుకుంటున్న ‘ఫస్ట్ కిస్’ సాంగ్
రెజీనా కసాండ్రా, దిలీప్ ప్రకాశ్ జంటగా నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు మేకర్స్. ‘ఫస్ట్ కిస్..’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేసింది యూనిట్. చిత్ర సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా రామ్ మిరియాల పాడారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘ఉత్సవం’ రూపొందింది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ‘ఫస్ట్ కిస్..’ పాట యువతను ఆకట్టుకుంటుంది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులందరూ చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు. -
‘థాయ్‌పుసం’ తెలంగాణ స్టైల్లో!
థాయ్‌పుసం.. తమిళులకు ఇదో ప్రధాన ఉత్సవం. ఒంటికి శూలాలు గుచ్చుకుని అత్యంత భక్తిప్రపత్తులతో సుబ్రమణ్యస్వామికి మొక్కులు చెల్లించే వేడుక. తమిళనాడుతోపాటు మలేషియా, సింగపూర్, శ్రీలంక, ఇండోనేషియా, ఆ్రస్టేలియా తదితర దేశాల్లో స్థిరపడిన తమిళ ప్రజలు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే, తెలంగాణలోనూ థాయ్‌పుసంను జరుపుతారు. అదెక్కడ? ఎలా జరుపుతారు? థాయ్‌పుసంకు మనకు ఉన్న సంబంధమేంటి?అన్న వివరాలు తెలుసుకోవాలంటే.. వందలఏళ్లతరువాత మాతృదేశానికి.. 1962లో బర్మాలో సైనిక తిరుగుబాటు జరిగిన అనంతరం అక్కడి భారతీయులను కట్టుబట్టలతో దేశం ఖాళీ చేయించారు. భారతీయ మహిళల మెడలోని బంగారు పుస్తెలతాళ్లను సైతం లాక్కుని వెనక్కి పంపారు. దీంతో బతుకుజీవుడా అంటూ పలువురు భారతీయులు మాతృదేశానికి వచ్చారు. వీరి కోసం అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రాంతాల్లో శరణార్థుల శిబిరాలను ఏర్పాటు చేసింది. వాటిల్లో పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం అంతర్గాం శిబిరం ఒకటి. 1975లో ఇక్కడ శ్రీలంక, తమిళనాడు, ఆంధ్ర నుంచి బర్మాకు వలస వెళ్లిన భారత సంతతివారికి పునరావాసం కల్పించారు. ఈ క్రమంలో అక్కడ జమ్మిచెట్టు కింద స్వయంభూ వెలసిన అమ్మవారిని అప్పటి నుంచి వీరంతా నూకాంబిక–పోచమ్మ అమ్మవారిగా కొలుస్తున్నారు. థాయ్‌పుసం తరహాలో ఇక్కడ కూడా నూకాంబిక అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒంటినిండా శూలాలు గుచ్చుకుని.. అంతర్గాంలో స్థానిక శరణార్థులు ఏటా ఉగాదికి ముందు అమ్మవారికి నవరాత్రులు నిర్వహించి చివరికి అమావాస్య రోజున ఒంటికి పదునైన శూలాలను గుచ్చుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తమను ఆపదలో ఆదుకుంటుందనే నమ్మకంతో అమ్మవారికి ఇలా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. శూలాలు గుచ్చుకున్నా.. భక్తుల శరీరాలపై రక్తం కారదు. సిద్ధహస్తులు, అనుభవజ్ఞులైనవారు రక్తనాళాలు తక్కువగా ఉన్న చోటే శూలాలు, కొక్కాలను గుచ్చుతారట. కొందరు వీపుపై కొక్కెలు గుచ్చుకుని చిన్న రథాలు కూడా లాగి తమ భక్తి చాటుకుంటారు. ఈ క్రమంలో భక్తుల నెత్తిన మిగతా భక్తులు పాలు పోస్తుంటారు. తరువాత కావడి ఆట్టంపేరిట అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తూ లయబద్ధంగా నర్తిస్తారు. రాత్రిపూట మరికొందరు భక్తులు చింత నిప్పులగుండంలో నడుస్తారు. శరణార్థులంతా అమ్మవారికి మాలధారణ ఆచరిస్తారు. పసుపు వ్రస్తాలు ధరించిన పురుషులు 21 రోజులు, మహిళలు వారం లేదా 11 రోజులపాటు మాలధారణలో ఉంటారు. ఈ ఉత్సవానికి తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా స్థిరపడ్డ వీరి సంతతివారే కాకుండా, లండన్, న్యూజిలాండ్, అండమాన్ నికోబార్, శ్రీలంక నుంచి భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం అంతర్గాంలో నూకాంబిక అమ్మవారి ఉత్సవాలు ఘనంగానిర్వహించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో చేస్తున్నాం:రామారావు,ఉత్సవ నిర్వాహకుడు మా ముత్తాతలను బ్రిటిష్ వారు తోటల్లో పనిచేసేందుకు కూలీలుగా బర్మా (మయాన్మార్)లోని రంగూన్ (ఇప్పుడుయాంగాన్)కు తీసుకెళ్లారు. వారు తమతోపాటు భారతీయ ఆచార వ్యవహారాలను సైతం తీసుకెళ్లారు. తిరిగి ఇండియాకు వచ్చాక మేం మా పూర్వీ కుల ఆచారాలను కొనసాగిస్తున్నాం. గ్రామంలో వెలిసిన అత్యంత శక్తిమంతురాలైన నూకాంబిక–పోచమ్మ అమ్మవారికి ఏటా ఉత్సవాలు నిర్వహించి మా భక్తిని చాటుకుంటున్నాం. అత్యంత భక్తి, నిష్టలతో శూలాలతోఒంటికి గుచ్చుకుని, బొనమెత్తుకొని చింతనిప్పులపై నడిచి మొక్కులు చెల్లిస్తుంటాం. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
రణక్షేత్రంలో ఉప్పొంగిన ఉత్సాహం.. వైభవంగా వీరారాధనోత్సవాలు
పల్నాటి రణక్షేత్రం కారంపూడి కత్తిగట్టి కదంతొక్కిందా.. వీరావేశంతో నాగులేరు ఉవ్వెత్తున ఉప్పొంగిందా.. బ్రహ్మనాయుడి ఉగ్రనృసింహకుంతం సమరనాదం మోగిస్తూ ముందుకురికిందా.. పల్నాటి పౌరుషాగ్నిని రగిలించిందా.. అన్నట్టు పోరాటాల పురిటిగడ్డ పల్నాడు గర్జించింది. వీరారాధనోత్సావాలతో ప్రతిమదీ పులకించింది. వీరుల కొణతములతో వీరంగమాడింది. కారంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాల రెండో రోజు రాయబారం ఘట్టం వైభవంగా జరిగింది. వీరాచారవంతులు వీరుల కొణతములతో కదంతొక్కారు. ఎదురు రొమ్ములపై బాదుకుంటూ కత్తిసాము చేశారు. వీరుల గుడిలో కొలువుదీరిన ఆయుధాలకు పూజలు చేశారు. రెండుగంటల పాటు కత్తుల సేవ చేశారు. అనంతరం గ్రామోత్సవానికి బయలు దేరారు. వీరులు కొందరు వీరావేశంతో ఊగిపోతుంటే బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహకుంతం వారిపై వాలి ఓదార్చే ఘట్టం అబ్బురపరిచింది. అనంతరం చెన్నకేశవస్వామి ఆలయం బయట, బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద వీర్ల అంకాలమ్మ తల్లి ఆలయంలో వీరాచారవంతులు కత్తి సేవ చేశారు. చిన్న పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఉగ్ర రూపులై ఉత్సవంలో పాలుపంచుకున్నారు. చెన్నకేశవుని దీవెనలు పొంది చెన్నకేశవస్వామి, అంకాలమ్మ చెంతకు ఒక్కో ఆచారవంతుడు ఆయుధంతో వెళ్లి వారి దీవెనలు పొందారు. గంటలు గణగణ మోగిస్తూ జై చెన్నకేశవ అంటూ నినదించారు. గోవింద నామస్మరణలు చేశారు. అనంతరం పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఇంటి వద్దకు చేరుకుని అక్కడ కొద్ది సేపు కత్తి సేవ చేశారు. రణక్షేత్ర వీధులు సంప్రదాయ డోలు, వీరు జోళ్ల వాయిద్యాలు, సన్నాయి మేళాలతో మార్మోగాయి. ఆయుధాలతో వీరులు చేసిన గ్రామోత్సవం ఆద్యంతం నాటి పోరాటాన్ని కళ్లకుకట్టింది. వీరుల గుడి నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా చెన్నకేశవస్వామి, అంకాలమ్మ ఆలయాలకు చేరుకుని కోట బురుజు మీదుగా పీఠాధిపతి ఇంటి వరకు, అక్కడి నుంచి మళ్లీ వీరుల గుడి వరకు గ్రామోత్సవం కొనసాగింది. వీరుల ఆయుధాలకు కారంపూడి ప్రజలు నీరాజనాలు పలికారు. వారుపోసి కొబ్బరి కాయలు కొట్టి ఆశీస్సులు పొందారు. ఆయుధాలకు పంచామృతాభిషేకాలు పల్నాటి వీరాచారవంతులు పల్నాటి రణక్షేత్రాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే వారు తొలుత తలనీలాలు సమర్పించి నాగులేరులో స్నానం చేశారు. నాగులేరు గంగధారి మడుగులో ఆయుధాలను శుభ్రం చేసుకున్నారు. కొందరు పంచామృతాలతో వీరుల ఆయుధాలను నాగులేరులో అభిషేకించడం విశేషం. నూతన వస్త్రాలతో పూజ కట్టుకున్నారు. వీరంతా ఒకేసారి ఆయుధాలను వీరుల గుడిలో ఉంచి పొంగళ్లు చేసుకుని వీర్ల అంకాలమ్మ, చెన్నకేశవస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. గురువారం తెల్లవారు జాము వరకు కూడా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వీరాచారవంతులు వస్తూనే ఉన్నారు. శుక్రవారం కూడా మరికొందరు రానున్నారు. రాయబారం కథాగానం రెండో రోజు రాయబారం చారిత్రక ఘట్టం నేపథ్యంలో వీరుల గుడిలో రాత్రి అలరాజు రాయబారం కథాగానాన్ని వీరవిద్యావంతులు గానం చేశారు. వేదనాభరితమైన ఈ ఘట్టం గుండెలను పిండేసింది. మందపోరు ఘట్టం.. చాపకూడు పల్నాటి వీరారాధనోత్సవాలలో 3వ రోజు శుక్రవారం మందపోరు ఘట్టం జరగనుంది. ఈ రోజు బ్రహ్మనాయుడు చాపకూడు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితోపాటు ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారులు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. సుమారు పది వేల మంది సహపంక్తి భోజనాలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ చేయూతతో ఈ కార్యక్రమం జరుగుతోంది. -
నాటక కళాకారులను గుర్తుతెచ్చే ‘ఉత్సవం’
నాటక కళా రంగం గొప్పదనం గురించి తెలియజేస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వ వహిస్తున్న ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా దీలీప్, రెజీనా నటించారు. ముఖ్య పాత్రల్లో ప్రకాశ్‌రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు నటించారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్ విడుదల కానుంది. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అనూప్ రూబెన్స్ తన పాటలతో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడని, కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ అద్భుతమైన విజువల్స్‌తో ‘ఉత్సవం’ను అందంగా తీర్చిదిద్దారని చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని చెప్పారు. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు
-
అంతర్వేదిలో ఉట్టిపడిన ఆధ్యాత్మిక శోభ
-
ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రగిరిలో వైకుంఠ ప్రయుక్త ఏకాదశి ఉత్సవాలు శనివారం వైభవోపేతంగా ప్రారంభమయ్యా యి. అధ్యయనోత్సవాల్లో భాగంగా పరివార దేవతల ను ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో వేంచేయింప జేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడిలో శ్రీ సీతారామచంద్రస్వామి వారిని మత్సా్య వతారంలో అలంకరించిన అర్చకులు బేడా మండపానికి తీసుకొచ్చారు. అక్కడ ఆళ్వార్ల మధ్య స్వామి వారిని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన గావించారు. అధ్యయనోత్సవాల నిర్వహణలో పాల్గొనే అర్చకులు, వేదపండితులు, ఇతర సిబ్బందికి దేవస్థానం తరఫున ఈఓ రమేశ్‌బాబు దీక్షా వస్త్రాలను అందజేశారు. స్వామివారితో పాటు పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు గావించా రు. అనంతరం వేద పండితులు చతుర్వేదాలను, దివ్య ప్రబంధాలను పఠించారు. ఆ తర్వాత మత్సా్యవతారంలో ఉన్న రామయ్యను గర్భగుడిలోకి తీసుకెళ్లి మూలమూర్తుల వద్ద కొద్దిసేపు ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామి వారిని వేంచేయింపజేసి కోలాటా లు, భజనలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్త జనసందోహం నడుమ గోదావరి తీరం వరకు ఊరే గింపుగా తీసుకెళ్లారు. అక్కడ పూజలు చేసిన తర్వాత తిరిగి కల్యాణమండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి వారిని భక్తుల సందర్శనార్థం వేంచేయింపజేశారు. మత్సా్యవతార రూపుడైన శ్రీసీతారామచంద్రస్వామి వారిని కనులారా తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు ఆశీర్వచనాలు అందజేసి, స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆలయ వేదపండితులు మత్సా్యవతర రూపం విశిష్టతను వివరించారు. పురవీధుల్లో స్వామివారు... మిథిలా ప్రాంగణంలో పూజలు అందుకున్న శ్రీసీతారామచంద్రస్వామి వారిని అక్కడ నుంచి పల్లకిపై పురవీధుల్లో తిరువీధి సేవకు తీసుకెళ్లారు. మహిళా భక్తుల కోలాటాలతో రామ నామ సంకీర్తనలు ఆలపించగా, వేద విద్యార్థులు, వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భక్తజనం తోడుగా స్వా మివారు పురవీధుల్లో ఊరేగారు. దారి పొడువునా భక్తులు స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ రమేశ్‌బాబు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, ఏఈఓ శ్రావణ్ కుమార్, వేదపండితులు మురళీ కృష్ణమాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, డీఈ రవీందర్, ఈవోటు సీసీ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు కూర్మావతారం... సీతారామచంద్రస్వామి వారు ఆదివారం కూ ర్మావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ‘ దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని చిలకించగా, వాసుకి అనే పామును తాడుగా చేసుకొని, అమృతానికై క్షీరసాగరాన్ని చిలుకుతున్న సమయంలో ఏ ఆధారం లేక మంధరగిరి మునిగిపోగా, దేవతలు, రాక్షసుల ప్రార్థనలతో శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మునిగిపోయిన మం ధర పర్వతాన్ని తన వీపున నిలుపుకొని పైకెత్తి సహాయపడ్డాడు. ఈ అవతారాన్ని దర్శించడం వల్ల శని గ్రహ సంబంధమైన దోషాలు తొలగుతాయి’ అని పండితులు చెబుతున్నారు. నేటి సాంస్కృతిక కార్యక్రమాలు... మిథిలా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భద్రాచలానికి చెందిన శ్రీరామ సేవాతరంగణి సరోజని బృందంచే భజన సంకీర్తన, ఖమ్మానికి చెందిన ఎల్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాయభారం హరికథా కాలక్షేపం ఉంటాయి. ఆ తర్వాత విజయవాడ జయరామ, సుధాకర్ వారిచే గాత్ర కచేరి, భద్రాచలానికి చెందిన అల్లం రమాదేవిచే భక్తి సంగీతం, మంగళగిరికి చెం దిన గోలి శ్రీలక్ష్మి వారిచే కూచిపూడి నృత్యం, హై దరాబాద్‌కు చెందిన సాయి దంషిక కూచిపూడి నృ త్యం, ఖమ్మం రాయప్రోలు అలేఖ్య బృందంచే కచేరి ప్రదర్శించనున్నారు. తర్వాత వనంవారి కృష్ణాపురం వనం శ్రీముఖి, రఘుమయిచే నాట్య ప్రదర్శన ఉంటుంది. హైదరాబాద్ జనత సేవా సమితి వారిచే భక్త రామదాసు నాటకం ఉంటుంది. పర్ణశాలలో పెబ్బేరుకు చెందిన హెచ్ఎం సుధాకర్‌చే శ్రీరామ పట్టాభిషేకం హరికథ ఉంటుంది. -
ఆకట్టుకున్న కల్యాణ రాయబారం
చిట్టమూరు: మల్లాంలోని వళ్లీదేవసేన సమే త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన స్వామి వారి కల్యాణ రాయబారం ఆకట్టుకుంది. ఈశ్వరుడు కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి దేవసేనను ఇచ్చి కల్యాణం జరి పించాలని సప్తరుషులు దేవేంద్రుని వద్దకు పెద్దలుగా వెళ్లి కోరే విధానాన్ని వేద పండితులు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఈ సందర్భంగా స్వామి,అమ్మవార్లను చందనంతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన పాటకచేరి అలరించింది. చందనాలంకారానికి దువ్వూ రు రామస్వామిరెడ్డి, లింగారెడ్డి జయచంద్రారెడ్డి, విజయశేఖర్‌రెడ్డి ఉభయకర్తలుగా వ్యవహరించారు. నేడు కల్యాణం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా మంగళవారం స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ పాపారెడ్డి వెంకటసుబ్బారెడ్డి తెలిపారు.