ఫ్యామిలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌.. ట్రైలర్ వచ్చేసింది! | Dilip Prakash And Regina Cassandra Utsavam Movie Trailer Out Now, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Utsavam Trailer: లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉత్సవం.. ట్రైలర్‌ చూశారా?

Published Sun, Sep 1 2024 2:00 PM | Last Updated on Sun, Sep 1 2024 4:58 PM

Dilip Prakash and Regina Cassandra Entertainer Trailer Out Now

దిలీప్ ప్రకాశ్, రెజీనా జంటగా నటించిన తాజా చిత్రం ఉత్సవం. ఈ సినిమాకు అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్ పిక్చర్స్ బ్యానర్‌పై సురేశ్ పాటిల్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రంగస్థల నాటకం ప్రధాన అంశంగా ఈ మూవీని రూపొందించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్‌లో లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ చూస్తుంటే ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా.. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మనందం, ప్రకాశ్ రాజ్, నాజర్, అలీ, ఎల్బీ శ్రీరామ్, అనీశ్, ఆమని, సుధా, ప్రియదర్శి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్‌ సంగీతమందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement