ఆకట్టుకున్న కల్యాణ రాయబారం
ఆకట్టుకున్న కల్యాణ రాయబారం
Published Tue, Sep 20 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
చిట్టమూరు: మల్లాంలోని వళ్లీదేవసేన సమే త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన స్వామి వారి కల్యాణ రాయబారం ఆకట్టుకుంది. ఈశ్వరుడు కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి దేవసేనను ఇచ్చి కల్యాణం జరి పించాలని సప్తరుషులు దేవేంద్రుని వద్దకు పెద్దలుగా వెళ్లి కోరే విధానాన్ని వేద పండితులు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఈ సందర్భంగా స్వామి,అమ్మవార్లను చందనంతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన పాటకచేరి అలరించింది. చందనాలంకారానికి దువ్వూ రు రామస్వామిరెడ్డి, లింగారెడ్డి జయచంద్రారెడ్డి, విజయశేఖర్‌రెడ్డి ఉభయకర్తలుగా వ్యవహరించారు.
నేడు కల్యాణం
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా మంగళవారం స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ పాపారెడ్డి వెంకటసుబ్బారెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement