హీరోయిన్ రెజీనా
తమిళసినిమా : అలాంటి వాటి గురించి అస్సలు పట్టించుకోను అంటోంది నటి రెజీనా కాసాండ్రా. ఈ అమ్మడికి నటిగా సక్సెస్‌లు ఉన్నా, రావలసిన పేరు తెచ్చుకోలేకపోయిందనే చెప్పాలి. తమిళం, తెలుగు అంటూ బహుభాషా నటిగా రాణిస్తున్నా, స్టార్ హీరోయిన్ స్థాయికి ఇంకా ఎదగలేదు. దీంతో ఇక లాభం లేదనుకుందో ఏమో నటి కంటే గ్లామర్‌నే నమ్మకున్నట్లు ఈ అమ్మడి తాజా చిత్రం చూస్తే తెలుస్తోంది. రెజీనా నటించిన తాజా చిత్రం మిస్టర్ చంద్రమౌళి. ఇందులో సీనియర్ నటుడు కార్తీక్, ఆయన కొడుకు గౌతమ్ కార్తీక్‌లతో కలిసి నటించింది. తిరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెజీనా అందాలారబోత విషయంలో రెచ్చిపోయిందనే చెప్పాలి. ఈత దుస్తులు, బికినీలు అంటూ ఎన్ని విధాలుగా శృంగారాన్ని ఒలకబోయాల్లో అన్ని విధాలు శక్తివంచన లేకుండా చేసేసిందనే చెప్పాలి. ఏ స్థాయిలో నటించిందంటే ఆ పాట దృశ్యాలను చూసిన దర్శకుడు సుశీంద్రన్ పాటలో అన్ని దృశాలు ఉండవు. సెన్సార్ బోర్డు కట్ చేస్తుంది అని చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపైనే వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రెజీనా ఇచ్చిన భేటీ చూద్దాం.
ప్ర: మిస్టర్ చంద్రమౌళి చిత్రంలో తండ్రీకొడుకులు కార్తీక్, గౌతమ్ కార్తీక్‌లతో కలిసి నటించిన అనుభవం గురించి?
జ: సూపర్ జాలీ. కార్తిక్ స్పాట్‌లో ఉంటే సందడే సందడి. సాధారణంగా సీనియర్ నటులతో నటిస్తున్నప్పుడు కాస్త సంక ట పరిస్థితిని ఎదుర్కొం టాం.అలాంటిది కార్తీక్‌తో నటించడం చాలా జాలీ అని పించింది. మేమంతా ఆయన చుట్టూ కూర్చుంటాం. ఆయన తన చిత్రాల గురించి, అనుభవాల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను చెప్పేవారు. కార్తీక్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నటన కంటే కూడా జీవి తాన్ని ఎలా సంతోషంగా గడపాలన్నది కార్తీక్ నుంచి తెలుసుకున్నా ను. ఆయన కొడుకు గౌతమ్ కార్తీక్‌తో నీపై చా లా బాధ్యతఉందని చాలా సార్లు చెప్పాను.
ప్ర: హీరోయిన్‌గా నటిస్తూ తెలుగు చిత్రం ‘అ’ లో చాలా చిన్న పాత్రలో నటించడానికి అంగీకరించారే?
జ: నిజం చెప్పాలంటే నేను హీరోయిన్‌గా నటించడం మొదలు పెట్టినప్పటి నుంచి చిత్రంలో నా పాత్ర చిన్నదా, పెద్దదా అని ఆలోచించలేదు. కథలో నా పాత్రకు ఏ మేరకు ప్రాధాన్యత ఉందన్నది గ్రహించే ప్రతిభ నాకుంది అ చిత్రంలో అలాంటి పాత్రనే లభించింది. చిత్రం చూసిన పలువురు నా నటనను ప్రశంసించారు. అలాంటి ప్రశంసలు విన్నప్పుడు పడ్డ కష్టాలు మరిచిపోతాను. ఆ చిత్రం కోసం ముక్కుకు రింగ్ పెట్టుకున్నాను. జుట్టు కట్ చేసుకున్నాను. వీపు వెనుక టాట్టు పొడిపించుకున్నాను. ఒక్కసారి మేకప్ వేసుకుంటే 24 గంటల తరువాతే తీసేదాన్ని అంత కష్టపడి నటించాను. భవిష్యత్‌తో ఇలాంటి ఒక పాత్రలో నటించాను చూడండి అని ధైర్యంగా చెప్పుకోవచ్చు.
ప్ర:దక్షిణ సినిమా చాలా మారుతోందని ఇటీవల పేర్కొన్నారు. ఆ మార్పులేమిటో వివరిస్తారా?
జ:మూడేళ్ల ముందు కంటే ఇప్పుడు విభిన్న కథలు, కథనాలను వింటున్నాం. స్క్రీన్‌ప్లేతో సహా కథను పూర్తిగా ఈ మెయిల్‌లో పంపి చదవమంటున్నారు. మేము బాగా నటించగలిగినా రిహార్సల్స్‌కు రాగలరా అంటూ మర్యాదగా పిలుస్తున్నారు. టీమ్ వర్క్, ప్రమోషన్, ప్రణాళిక అంటూ అదరగొడుతున్నారు. ఇవన్నీ మంచి పరిణామాలేగా.
ప్ర: సరే. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో హీరోహీరోయిన్లపై విమర్శలు, ఎగతాళి చేయడాలు అధికం అవుతుండడం గురించి?
జ: నేను అన్ని కామెంట్స్‌ను చదవను. సమయం లభిస్తే అప్పుడప్పుడు చూస్తుంటాను. ఒక్కొక్కరి దృష్టి ఒక్కోలా ఉంటుంది. ఒక మహిళ రోడ్డులో వెళుతుంటే ఆమె ధరించిన దుస్తులు నాకు సూపర్‌గా ఉన్నాయనిపించవచ్చు. మరొకరికి అసభ్యంగా అనిపించవచ్చు. అది చూసే వారి దృష్టిని బట్టి ఉంటుంది కాబట్టి విమర్శలను, వెటకారాలను నేను పట్టించుకోను.
ప్ర: హీరోయిన్లకు గ్లామర్ చాలా ముఖ్యం. దాన్ని కాపాడుకోవడానికి ఎలాంటివి పాటిస్తుంటారు?
జ: ఇప్పుడు అందరికీ ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. నేను కొన్ని సమయాల్లో షూటింగ్ పూర్తి అయిన తరువాత సంతోషంగా ఉంటే ఇంటికెళ్లగానే వర్కౌట్స్ చేస్తాను. నాకు జిమ్‌కు వెళ్లడం అస్సలు నచ్చదు. ఇంటి పక్కన ఉన్న పార్క్‌లోకి వెళ్లి జాగింగ్ చేస్తాను. అక్కడ నన్నెవ్వరూ గుర్తుపట్టరు.
Comments
Please login to add a commentAdd a comment