‘‘ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తయితే ఇక రెజీనా కొత్త సినిమాలేవీ ఒప్పుకోరు’’... చెన్నైలో జరుగుతున్న ప్రచారం ఇది. ఎందుకు సినిమాలు చేయరంటే.. ఈ నెల 13న ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగిందని అంటున్నారు. ఎవరితో? అంటే నో ఆన్సర్. అయితే రహస్యంగా నిశ్చితార్థం జరిగిందని ఓ తమిళ వెబ్‌సైట్ పేర్కొంది. అవునా? అని రెజీనా సన్నిహితులను అడిగితే.. ఎంగేజ్‌మెంటా? ఎప్పుడు జరిగింది? అంటున్నారు. ‘‘ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదు. అసలు రెజీనాకి ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి’’ అని కూడా స్పష్టం చేశారు.
ఇక రెజీనా చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. పీవీపీ సంస్థ నిర్మించిన ‘ఎవరు’లో నటించారామె. ఆగస్ట్‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. అలాగే నూతన దర్శకుడు అర్జున్ సాయి తెరకెక్కిస్తున్న ‘ఉత్సవం’లో నటిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. అటు తమిళంలో చేస్తున్న ‘కసడ తపర’ చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇది కాకుండా ‘పార్టీ’ అనే సినిమా తుది దశలో ఉంది. అలాగే అరవింద్ స్వామితో చేస్తున్న ‘కల్లాపార్ట్’ చివరి షెడ్యూల్‌లో ఉంది. ఇలా తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న రెజీనా సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకుంటారా?
Comments
Please login to add a commentAdd a comment