స్కిన్‌షో...లిప్‌లాక్‌కు రెడీ! | Ready for lip-locks : Regina Cassandra | Sakshi
Sakshi News home page

స్కిన్‌షో...లిప్‌లాక్‌కు రెడీ!

May 3 2014 11:09 PM | Updated on Sep 2 2017 6:53 AM

స్కిన్‌షో...లిప్‌లాక్‌కు రెడీ!

స్కిన్‌షో...లిప్‌లాక్‌కు రెడీ!

కథ డిమాండ్ చేస్తే స్కిన్‌షో, లిప్‌లాక్‌లు చేస్తాను. అయితే... వాటి ప్రాధాన్యతను దర్శకుడు నాకు వివరించగలగాలి. నేను వ్యక్తిగతంగా షార్ట్స్ ధరించను.

‘‘కథ డిమాండ్ చేస్తే స్కిన్‌షో, లిప్‌లాక్‌లు చేస్తాను. అయితే... వాటి ప్రాధాన్యతను దర్శకుడు నాకు వివరించగలగాలి. నేను వ్యక్తిగతంగా షార్ట్స్ ధరించను. పద్ధతిగా ఉంటాను. కానీ నటి అయ్యాక అది చేయను, ఇది చేయను అంటే కుదరదు కదా!’’ అని రెజీనా వ్యాఖ్యానించారు. ఇటీవల విడుదలైన ‘కొత్త జంట’లో అల్లు శిరీష్ సరసన రెజీనా నటించారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో పత్రికల వారితో ముచ్చటిస్తూ ‘‘‘కొత్తజంట’ కథ విన్నప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. దర్శకుడు మారుతి నాతో బాగా చేయించారు.

 సినిమా చూసి బాగా చేశావని అల్లు అర్జున్ కాంప్లిమెంట్ ఇచ్చారు’’ అన్నారు. తాను మట్టి లాంటిదాన్నని, దర్శకుడు ఎలా చెబితే అలా చేస్తానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. భగవంతుడి దయ వల్ల తనపై గాసిప్స్ ఏమీ రాలేదని రెజీనా సంతోషం వెలిబుచ్చారు. రెగ్యులర్‌గా జిమ్‌కెళ్తానని, యోగా చేస్తానని, డైట్ పాటిస్తానని, అయితే పార్టీలకు చాలా దూరంగా ఉంటానని రెజీనా తెలిపారు. ప్రస్తుతం తను నటిస్తున్న రారా కృష్ణయ్య, పిల్లా నువ్వులేని జీవితం, శంకర, పవర్ చిత్రాలు తన కెరీర్‌ని మలుపు తిప్పుతాయని రెజీనా ఆశాభావం వెలిబుచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement