
చిన్నారులకు పాఠాలు చెబుతున్న రకుల్‌ప్రీత్ సింగ్
బంజారాహిల్స్: ‘నేను డాక్టర్ కాబోయి.. యాక్టర్ అయ్యాను’ అంటారు చాలామంది. అయితే ఇప్పుడు కొంతమంది యాక్టర్లు.. టీచర్ల అవతారం ఎత్తారు. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.
2014లో ఏర్పాటైన ‘టీచ్ ఫర్ ఛేంజ్’ స్వచ్ఛంద సంస్థ.. సర్కార్ స్కూళ్లలోని విద్యార్థుల్లో ఆంగ్ల పరిజ్ఞానం పెంపొందించడం లక్ష్యంగా పనిచేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 200 ప్రభుత్వ పాఠశాలలను ఈ సంస్థ దత్తత తీసుకుంది. మొత్తం 600 మంది వలంటీర్లు వారానికోసారి ఆయా స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు ఇంగ్లిష్‌లో రాయడం, చదవడం, మాట్లాడటం నేర్పిస్తారు. ఈ సంస్థను మరింత ప్రోత్సహించేందుకు కొందరు సినీ తారలు ముందుకొచ్చారు. వీలైన సమయంలో పాఠశాలలకు వెళ్లి గంటపాటు ఇంగ్లిష్ బోధిస్తున్నారు. రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్ సింగ్, రెజీనా, ప్రణీత, అల్లు శిరీష్ తదితరులు ఈ సంస్థకు చేయూతనందిస్తున్నారు. వీరు ఆసక్తిగా పాఠాలు బోధిస్తుండడంతో పాటు విద్యార్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇటీవల బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని గతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, హిమాయత్‌నగర్, ఫిలింనగర్, సికింద్రాబాద్ తదితర సర్కారు బడుల్లో రెజీనా, ప్రణీత పాఠాలు బోధించారు.
ఇదో సంతృప్తి..
పేద విద్యార్థులకు పాఠాలు చెప్పడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. ప్రతి నెలా రెండుసార్లు స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు క్లాస్ తీసుకుంటున్నాను. – రెజీనా
టీచర్ వృత్తి ఎంతో గౌరవప్రదమైంది.
నేను చదువుకునేరోజుల్లోటీచర్లను ఎంతో గౌరవించేదాన్ని.– రకుల్‌ప్రీత్ సింగ్

చిన్నారులకు పాఠాలు చెబుతున్న శిరీష్
Comments
Please login to add a commentAdd a comment