ఆకాశ సౌధంలో 103 అంతస్తులో ఉంటే ఎవరైనా ఏం చేస్తారు?
ఆకాశ సౌధంలో 103 అంతస్తులో ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? అక్కడి నుంచి ఏరియల్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. లేదంటే అంత ఎత్తైన ప్రదేశానికి వెళ్లినందుకు భయపడతారు. కానీ హీరోయిన్ రెజీనా తీరే వేరు. 103 అంతస్తులో రెజీనా ఏం చేసిందో తెలుసా. తీరిగ్గా ఫుఫ్ అప్స్ తీసింది. ఇటీవల షికాగోలోని ఆకాశహర్మ్యం 'స్కైడెక్ షికాగో'ను ఆమె సందర్శించింది. ఇందులో చివరి ఫ్లోర్ కు చేరుకుని సందడి చేసింది.
కాలి కింద నుంచి అద్దంలోంచి కనబడుతున్న భవంతులను చూసేందుకు సరదాగా ఫుష్ అప్స్ తీసింది. దగ్గరగా చూసేందుకు ఇలా చేసిందన్న మాట. 103లో ఫుష్ అప్స్ చేస్తున్న ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసింది. అంతేకాదు స్కైడెక్ షికాగోకు వెళ్లి ఏరియ్ వ్యూతో సరిపెట్టుకోకుండా తనలాగే ఫుష్ అప్స్ తీయమని సలహాయిచ్చింది. ఫొటో తీసుకోవడం మర్చిపోద్దని ట్వీట్ చేసింది.
When ur on the 103rd floor of the @skydeckchicago and someone drops to do push-ups, u don't just… https://t.co/lg0IxacsU6
— ReginaCassandra (@ReginaCassandra) March 19, 2016