
పవన్ కల్యాణ్, అమల అంటే ఇష్టం
'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకోవటంతో హీరోయిన్ రెజీనా ఫుల్ ఖుషీగా ఉంది. 2011లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన తాను ఇప్పటివరకూ ఏడు సినిమాల్లో నటించినట్లు చెప్పింది. తమిళనాడుకు చెందిన తాను కాలేజీలో చదువుతున్నప్పుడు ఓ షార్ట్ఫిల్మ్లో నటించినట్లు చెప్పింది. కడినాల్ మొదల్ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయినా... తనకు తెలుగులోనే ఎక్కువగా అవకాశాలు వచ్చియని తెలిపింది. సినీ నటిని అవుతానని తానెప్పుడూ ఊహించలేదంది.
ఇక నటనాపరంగా అమల, పవన్ కల్యాణ్ అంటే అభిమానమని రెజీనా వెల్లడించింది. అమ్మానాన్న, ఇద్దరు చిన్నమ్మలు తన ఎదుగుదలకు ప్రోత్సహించారని, సినిమా అంటే ప్యాషన్ అని... చిత్రరంగాన్ని ఎన్నటికీ వదులుకోలేనని తెలిపింది. ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు నటించిన అన్ని చిత్రాలు తనకు ఇష్టమని, నటనకు సంబంధించి ఓ లక్ష్యమంటూ ఏమీ లేదని, ఎంత వరకూ వెళ్లగలిగితే అంతవరకూ నటిస్తూనే ఉంటానని తెలిపింది.