subramanyam for sale
-
ఆయనతో సినిమా నా లక్ష్యం
‘కృష్ణాష్టమి’ చిత్రం వినోద ప్రధానంగా, హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. సునీల్ హీరోగా వాసూ వర్మ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు చెప్పిన విశేషాలు... ‘కృష్ణాష్టమి’ సినిమా షూటింగ్ ఆగస్టులోనే పూర్తయింది. సెప్టెంబరులో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ రిలీజ్ ఉండటంతో అక్టోబరులో రిలీజ్ చేద్దామనుకున్నా. కానీ, ‘రుద్రమదేవి, అఖిల్, బ్రూస్లీ’ లాంటి పెద్ద సినిమాల రిలీజ్‌లను ప్రకటించడంతో డిసెంబరులోనో, సంక్రాంతి టైమ్‌లోనో రిలీజ్ ప్లాన్ చేశాం. అప్పుడు కూడా చాలా సినిమాలు ఉండటంతో అనువైన తేదీ కోసం చూశాను. ఫిబ్రవరి 19 సరైన డేట్ అనిపించింది.. ముందు బన్నీతో ఈ సినిమా తీద్దామనుకున్నాం. దర్శకుడు గోపీచంద్ మలినేని ‘పండగ చేస్కో’ కన్నా ముందే నాకీ కథ చెప్పాడు. ఈ కథ విన్న బన్నీ, ‘‘ ‘ఆర్య, ‘పరుగు’ తర్వాత మనం చేసే సినిమా సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండాలి. మామూలు కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేయకూడదు’’ అని సలహా ఇచ్చాడు. అందుకే ఆపేశాం. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ని కూడా బన్నీతోనే తీయాలనుకున్నాం. అప్పటికే త్రివిక్రమ్‌తో ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి బన్నీ కమిట్ కావడంతో, తనకు చెప్పి సాయిధరమ్‌తో ఈ సినిమా తీశాం. గోపీచంద్ మలినేని నాకు చెప్పిన ‘కృష్ణాష్టమి’ కథను వాసూవర్మకు చెప్పాను. ఆ తర్వాత తను కథ మీద వర్కవుట్ చేశాడు. సునీల్ ఈ కథ విని, ‘అన్నా... ఇంత పెద్ద బడ్జెట్ సినిమానా?’ అని ఆశ్చర్యపోయాడు. సునీల్‌కి ఈ సినిమా ఎంతగా నచ్చిందంటే ఈ సినిమా 80 శాతం పూర్తయ్యేవరకూ వేరే చిత్రాలను సునీల్ అంగీకరించలేదు. ‘జోష్’ సినిమా ఫ్లాప్ అయినా వాసుతో సినిమా చేయడానికి అతనికీ, మా బ్యానర్‌కీ ఉన్న అనుబంధమే. అయినా ‘జోష్’ కథను ఎంపిక చేసుకోవడంలో నిర్మాతగా నేను ఫెయిల్ అయ్యాను. దానికి నాదే బాధ్యత. అనిల్ రావిపూడి-సాయిధరమ్‌తేజ్ కాంబినేషన్లో ‘సుప్రీమ్’ రెడీ అవుతోంది. కృష్ణవంశీతో ఓ సినిమా ఉంటుంది. దాని పేరు ‘రుద్రాక్ష’ అని వార్త ప్రచారంలో ఉంది. ఆ టైటిల్ ఉండచ్చు... ఉండకపోవచ్చు. వరుణ్‌తేజ్ హీరోగా వెంకీ అనే కొత్త దర్శకునితో, అలాగే రాజ్‌తరుణ్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘శతమానం భవతి’... ఇలా వరుసగా సినిమాలు ఉన్నాయి. రవితేజ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయాలనుకున్న ‘ఎవడో ఒకడు’ని నాగార్జునగారితో చేద్దామను కుంటున్నాం. అయితే, ఇంకా చర్చల దశలోనే ఉంది. పవన్‌కల్యాణ్ తో సినిమా చేయాలన్నది నా లక్ష్యం. మంచి స్క్రిప్ట్‌తో వస్తే చేస్తానని ఆయన మాటిచ్చారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - సుబ్రమణ్యం ఫర్ సేల్
-
నిమజ్జనం వేడుకల్లో ’సుబ్రమణ్యం ఫర్ సేల్’ టీమ్
-
పవన్ కల్యాణ్, అమల అంటే ఇష్టం
'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకోవటంతో హీరోయిన్ రెజీనా ఫుల్ ఖుషీగా ఉంది. 2011లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన తాను ఇప్పటివరకూ ఏడు సినిమాల్లో నటించినట్లు చెప్పింది. తమిళనాడుకు చెందిన తాను కాలేజీలో చదువుతున్నప్పుడు ఓ షార్ట్‌ఫిల్మ్‌లో నటించినట్లు చెప్పింది. కడినాల్ మొదల్ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయినా... తనకు తెలుగులోనే ఎక్కువగా అవకాశాలు వచ్చియని తెలిపింది. సినీ నటిని అవుతానని తానెప్పుడూ ఊహించలేదంది. ఇక నటనాపరంగా అమల, పవన్ కల్యాణ్ అంటే అభిమానమని రెజీనా వెల్లడించింది. అమ్మానాన్న, ఇద్దరు చిన్నమ్మలు తన ఎదుగుదలకు ప్రోత్సహించారని, సినిమా అంటే ప్యాషన్ అని... చిత్రరంగాన్ని ఎన్నటికీ వదులుకోలేనని తెలిపింది. ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు నటించిన అన్ని చిత్రాలు తనకు ఇష్టమని, నటనకు సంబంధించి ఓ లక్ష్యమంటూ ఏమీ లేదని, ఎంత వరకూ వెళ్లగలిగితే అంతవరకూ నటిస్తూనే ఉంటానని తెలిపింది. -
కల్యాణ్ మావయ్య ఫోన్ చేసి, హెల్మెట్ కొన్నావా అన్నారు!
- సాయిధరమ్ తేజ్ * హరీశ్ శంకర్‌గారు నాకు ‘మిరపకాయ్’ సినిమా టైం నుంచి తెలుసు. ‘రామయ్య వస్తావయ్యా’ సినిమా తర్వాత ఆయన నాకీ కథ చెప్పడానికి వచ్చారు. అప్పుడాయన నాతో ఓ మాట అన్నారు. ‘‘నన్ను ‘గబ్బర్‌సింగ్’ డైరక్టర్‌గా చూడకు. ఇప్పుడు నేను ఫ్లాప్ డైరక్టర్‌గా కథ చెబుతున్నా. నీకు నచ్చితేనే చేద్దాం’’ అన్నారు. కథ నచ్చడంతో, వెంటనే ఓకే చెప్పేశాను. ఈ కథపై నాకు కలిగిన నమ్మకం అలాంటిది. ‘దిల్’ రాజుగారి సినిమాల్లో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్, హరీశ్ శంకర్ మార్క్ కమర్షియల్ హంగులతో ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలుస్తుంది. * చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించాలని తపించే పాత్రను ఈ సినిమాలో చేశాను. అందుకే అమెరికా వెళ్లి రెస్టారెంట్లో వెయిటర్‌లా, టాక్సీ డ్రైవర్‌గా.. డబ్బు కోసం ఇలా చాలా ఉద్యోగాలు చేస్తుంటాను. ఆ టైంలోనే హీరోయిన్‌కు సంబంధించిన ఓ సమస్యను సాల్వ్ చేస్తాను. ఈ క్రమంలోనే తనతో ప్రేమలో పడి, దాన్ని పెళ్లి దాకా ఎలా తీసుకెళ్లాననే ది మిగతా కథ. ఈ సినిమాలో మరో సాయిధరమ్ తేజ్‌ను చూస్తారు. నా గత చిత్రాలకు, ఈ సినిమాలోని పాత్రకు ఎటువంటి పోలిక ఉండదు. ఇందులోని సుబ్రమణ్యం పాత్రను ఆకళింపు చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. * ఈ సినిమాలో చిరంజీవి మావయ్య హిట్ సాంగ్ ‘గువ్వా గోరింకతో...’ పాటను రీమిక్స్ చేయాలన్నది హరీశ్, ‘దిల్’ రాజుగార్ల చాయిస్. ఆ సాంగ్ వేల్యూ చెడగొట్టకుండా చిత్రీకరించాం. ఏదో ఎట్రాక్ట్ చేయాలి అన్నట్టుగా ఈ పాట తీయలేదు. ఆయన సినిమాలను ఎలాగో రీమేక్ చేయలేం. అందుకే కనీసం పాటనైనా రీమేక్ చేయాలన్న ఉద్దేశంతో రీమేక్ చేశాం. ఈ పాటను అమెరికాలోని గ్రాండ్ కేనియన్లో చిత్రీకరించాం. అక్కడ తొలిసారిగా షూటింగ్ జరుపుకున్న సినిమా ఇదే. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు మాత్రమే షూటింగ్‌కు పర్మిషన్ ఇచ్చారు. రాత్రి 12 గంటల వరకు రిహార్సల్స్ చేసి, తెల్లవారుజామున మూడు గంటలకు అక్కడికి బయలుదేరి కేవలం రెండు గంటల్లో పల్లవి, చరణం షూట్ చేశాం. * నేను చిరంజీవి, పవన్‌కల్యాణ్ మావయ్యలను ఇమిటేట్ చేస్తున్నానని చాలా మంది అంటుంటారు. కావాలని వాళ్ల బాడీ లాంగ్వేజ్‌ను ఫాలో కావడం లాంటివి చేయను. చిన్నతనం నుంచి మావయ్యలను దగ్గరగా చూస్తూ పెరిగాను. అందువల్ల ఆ మేనరిజమ్స్ వచ్చాయేమో గానీ కావాలని అలా నటించను. * రెజీనాతో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాలో నటించాను. మంచి సపోర్టింగ్ కో యాక్టర్. రెజీనాతో వర్క్ చేయడం చాలా కంఫర్ట్‌బుల్‌గా అనిపించింది. రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డాను. కానీ ఆమె నా ఫ్రెండ్ కాబట్టి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఇద్దరం డిస్కస్ చేసుకుని హరీశ్ శంకర్‌కు చెప్పేవాళ్లం. * ఈ సినిమాలో మొదటిసారిగా నాగబాబు మావయ్యతో నటించాను. ఆయన రాకముందు చాలా ఈజీగా టేక్ ఓకే అయిపోయేది. కానీ ఆయన సెట్లోకి అడుగుపెట్టాక మాత్రం డైలాగ్ చెప్పడానికి టేక్స్ మీద టేక్స్ తీసుకునేవాణ్ణి. నా టెన్షన్ చూసి మావయ్య, హరీశ్‌గారు నాకు సర్ది చెప్పి డైలాగ్ చెప్పించారు. ఈ సినిమా షూటింగ్ టైంలో నాకిది మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమా విజయంపై నాకు చాలా నమ్మకం ఉంది. ప్రేక్షకులకు నచ్చితే చిన్న హీరో, పెద్ద హీరో అన్న తేడా ఉండదు. నచ్చితే సినిమా హిట్ చేస్తారు. * కథల విషయంలో ఎవరూ నాకు సలహాలివ్వరు. నాకేదైనా కథ నచ్చితే మావయ్యలకు ఇన్ఫార్మ్ చేస్తానంతే. నా విషయంలో మావయ్యలు చాలా కేరింగ్‌గా ఉంటారు. కల్యాణ్ మావయ్య తీసుకునే కేర్ గురించి ఓ ఎగ్జాంపుల్ చెప్పాలంటే.. నాకు బాగా డబ్బులు సంపాదించి బైక్ కొనాలని ఎప్పట్నుంచో ఆశ. ఈ మధ్యే హార్లీ డేవిడ్సన్ బైక్ కొన్నాను. ఆ విషయం తెలుసుకుని కల్యాణ్ మావయ్య ఫోన్ చేసి ‘హెల్మెట్ కొనుకున్నావా, గ్లౌజులు కొనుక్కున్నావా’ అని అడిగారు. అంత కేరింగ్‌గా ఉంటారు. * భవిష్యత్తులో నాకు వచ్చిన కథలు మా కుటుంబంలో ఎవరికైనా సెట్ అవుతాయంటే కచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇప్పటివరకూ అలాంటి పరిస్థితి రాలేదు. * మంచి ప్రాజెక్ట్స్‌తో ‘దిల్’ రాజుగారు అప్రోచ్ అయ్యారు. అందుకే నా తదుపరి చిత్రాలు కూడా ఆయనతో కమిట్ అయ్యాను. ఎవరైనా మంచి కథతో వస్తే, కచ్చితంగా వేరే బ్యానర్లో నటించడానికి రెడీ. ప్రస్తుతం ‘తిక్క’ షూటింగ్ జరుగుతోంది. ‘దిల్’ రాజుగారి బేనర్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సుప్రీం ఏసి డీటీఎస్’, అలాగే వేగేశ్న సతీశ్ దర్శకత్వంలో ‘శతమానం భవతి’ సినిమాలు త్వరలో సెట్స్ పైకి వెళతాయి. -
సుబ్రమణ్యం ఫర్ సీత టీంతో చిట్ చాట్
-
సుబ్రమణ్యం ఫర్ సేల్
సుబ్రమణ్యాన్ని అమ్మకానికి పెట్టారట! సుబ్రమణ్యం అంటే కత్తి లాంటి కుర్రాడు. తిమ్మిని బమ్మిని చేయగల తెలివైనోడు. అలాంటివాణ్ణి ఎందుకు సేల్కు పెట్టారో తెలియాలంటే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు హరీశ్ శంకర్. చురుకైన, పదునైన హీరోయిజాన్ని ఎంటర్టైనింగ్ వేలో ప్రెజెంట్ చేయడంలో హరీశ్‌శంకర్ స్పెషలిస్టు. ఇక కథను కరెక్టుగా జడ్జ్ చేసే కెపాసిటీ ఉన్న నిర్మాత ‘దిల్’ రాజు ఈ సినిమా విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ నెలాఖరున విడుదల కానున్న ఈ చిత్రం మీద సాయిధరమ్‌తేజ్, రెజీనా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. -
హీరోయిన్‌పై హరీశ్ పొగడ్తల వర్షం
హీరోయిన్ రెజీనాపై దర్శకుడు హరీష్ శంకర్ పొడగ్తల వర్షం కురిపించాడు. రెజీనాలో టాలెంట్ ఉందని, అనతి కాలంలోనే అగ్ర నటిగా పేరు తెచ్చుకుంటోందని హరీష్ ప్రశంసించాడు. 'పవర్' సినిమాలో ఆమె నటన తనకు చాలా ఇష్టమని తెలిపాడు. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రంలో సీత అనే పాత్రను రెజీనా చేస్తోందని, ఆ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని... రెజీనా కెరీర్లో ఈ పాత్ర గుర్తుండిపోతుందని హరీశ్ స్పష్టం చేశాడు. 'శివ మనసులో శృతి' చిత్రం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై భామ అనతి కాలంలోనే మంచి మార్కులు కొట్టేసింది. అందంతో పాటు నటనలోనూ సత్తా చూపిస్తూ అగ్ర హీరోల సరసన అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకెళుతోంది. తాజాగా హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రంలో సాయి ధరమ్ తేజ్‌తో రెండోసారి జత కట్టింది. (గతంలో వీరిద్దరూ 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాలో నటించారు). సుబ్రమణ్యం ఫర్ సేల్ ..ఆడియో ఈ నెల 23న శిల్పకళా వేదికలో విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా ఆడియో విడుదల కానుంది. ఈ చిత్రానికి మిక్కీ జే. మేయర్ సంగీతం సమకూర్చారు. కాగా చిరంజీవి నటించిన సినిమాలోని ఓ హిట్ సాంగ్‌ను ...సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంలో రీమిక్స్ చేసినట్లు తెలుస్తోంది. -
అమ్మకానికి సుబ్రమణ్యం
సుబ్రమణ్యాన్ని అమ్మకానికి పెడుతున్నారు. అదేంటి అనుకుంటున్నారా! అసలు....ఎవరా సుబ్రమణ్యం? ఏంటా కథ అనేది తెలియాలంటే ... సెప్టెంబర్ 24న విడుదల కానున్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చూడాల్సిందే. ‘పిల్లా నువు లేని జీవితం’, ‘రేయ్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇప్పుడు తన మూడో చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకుడు. రెజీనా కథానాయిక. ‘‘హరీశ్ శంకర్ సంభాషణలు, సాయిధరమ్‌తేజ్ నృత్యాలు, పోరాటాలు, రెజీనా అందచందాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న పాటలను విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: తోట ప్రసాద్, రమేశ్ రెడ్డి, సతీశ్ వేగేశ్న, సంగీతం: మిక్కీ జె. మేయర్, ఎడిటింగ్: గౌతంరాజు, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్. -
సుబ్రమణ్యం రేట్ ఎంత?
కొన్ని చిత్రాలు టైటిల్స్ నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఆ కోవకే చెందుతుంది. సుబ్రమణ్యంని ఎందుకు అమ్మకానికి పెట్టారు? అతని రేటెంత? లాంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు కాదు.. థియేటర్లో చూడాల్సిందే. సాయిధరమ్ తేజ్, రెజీనా జంటగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఓ వైవిధ్యభరితమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రేమ, చక్కని కుటుంబ కథ కలగలిసిన చిత్రం ఇది. గత 20 రోజులుగా కోకాపేట హౌస్‌లో నిరవధికంగా చిత్రీకరణ జరుపుతున్నాం. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను, పాటలను చిత్రీకరిస్తాం. వచ్చే నెల అమెరికాలో భారీ షెడ్యూల్ మొదలుపెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: సి.రాంప్రసాద్, సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్. -
హిట్ కొట్టిన హీరో
-
ఇద్దరు సుబ్రమణ్యాలు.. వచ్చేస్తున్నారు!
-
సేల్ మొదలైంది..!
‘పిల్లా నువ్వు లేని జీవితం’తో హిట్ జంటగా పేరు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ్, రెజీనాలతో హరీశ్‌శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. ఈ చిత్రం షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, హీరో అల్లు అర్జున్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సాయిధరమ్‌తేజ్‌ని పూర్తి కమర్షియల్‌గా చూపించనున్నానని హరీశ్‌శంకర్ అన్నారు. హరీశ్ సినిమాకు ముందు, తరువాత అనుకునేలా ఈ సినిమా ఉంటుందని సాయిధరమ్‌తేజ్ అభిప్రాయపడ్డారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ హైదరాబాద్‌లో, ఏప్రిల్ నుంచి అమెరికాలో జరిపే షెడ్యూల్స్‌తో షూటింగ్ పూర్తవుతుందనీ, వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తామనీ ‘దిల్’ రాజు తెలిపారు. ఈ చిత్రానికి కథనం: రమేశ్‌రెడ్డి, సతీశ్ వేగేశ్న, సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: సి.రాంప్రసాద్, కూర్పు: గౌతంరాజు, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్. -
సుబ్రమణ్యం ఫర్ సేల్
‘‘ఇప్పటివరకూ కథనే నమ్ముకొని సినిమాలు తీశాం. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ కూడా చక్కని కథతో రూపొందనున్న సినిమా. హరీశ్ శంకర్‌తో నేను తీసిన ‘రామయ్య వస్తావయ్యా’ అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. అయినా... అతని ప్రతిభపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో సాయిధరమ్‌తేజ్ స్టార్ హీరో అవుతాడు’’ అని ‘దిల్’ రాజు అన్నారు. సాయిధరమ్‌తేజ్, రెజీనా జంటగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. ఈ నెల 27 నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘సాయిధరమ్‌తేజ్ నటించిన సినిమా ఏదీ విడుదల కాకముందే... అతను హీరోగా సినిమాను ప్రారంభించామంటే... అతనిపై, హరీశ్‌శంకర్ కథపై మాకున్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 27 నుంచి మార్చి వరకూ హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుపుతాం. ఏప్రిల్ నుంచి అమెరికాలో షూటింగ్ ఉంటుంది. వేసవి కానుకగా సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘‘మిరపకాయ్’ టైమ్‌లోనే ఈ టైటిల్‌ని మీడియాకు తెలియజేశాను. అప్పట్నుంచీ ఈ కథపై కసరత్తులు చేస్తూనే ఉన్నాను. అయితే... ఎవరితో చేయాలనేది మాత్రం క్లారిటీ లేదు. ‘గబ్బర్‌సింగ్’ టైమ్‌లో పవన్‌కల్యాణ్‌గారితో సాయిధరమ్‌తేజ్‌ని చూశాను. తొలి చూపులోనే నచ్చేశాడు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ ప్రోమోస్ చూశాక నా సుబ్రమణ్యం ఇతనే అని ఫిక్స్ అయిపోయాను. సీత అనే పాత్రను రెజీనా చేస్తోంది. చాలా కొత్తగా ఉంటుందా పాత్ర. సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌తో తొలిసారి పనిచేస్తున్నాను. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ప్రతిభావంతులైన టీమ్ పనిచేస్తున్న వినోదాత్మక ప్రేమకథ ఇది’’ అని హరీశ్‌శంకర్ తెలిపారు. మంచి టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని సాయిధరమ్‌తేజ్ అన్నారు. ఎప్పుడెప్పుడు సెట్స్‌కి వెళ్తామా అని ఎదురు చూస్తున్నానని రెజీనా చెప్పారు. చిత్రబృందం కూడా సమావేశంలో పాల్గొన్నారు.