హీరోయిన్పై హరీశ్ పొగడ్తల వర్షం | director harish shankar praises herione regina | Sakshi
Sakshi News home page

హీరోయిన్పై హరీశ్ పొగడ్తల వర్షం

Aug 21 2015 10:13 AM | Updated on Sep 3 2017 7:52 AM

హీరోయిన్పై హరీశ్ పొగడ్తల వర్షం

హీరోయిన్పై హరీశ్ పొగడ్తల వర్షం

హీరోయిన్ రెజీనాను దర్శకుడు హరీష్ శంకర్ పొడగ్తల వర్షం కురిపించాడు. రెజీనాలో టాలెంట్ ఉందని, అనతి కాలంలోనే అగ్ర నటిగా పేరు తెచ్చుకుంటుందని హరీష్ ప్రశంసించాడు.

హీరోయిన్ రెజీనాపై దర్శకుడు హరీష్ శంకర్ పొడగ్తల వర్షం కురిపించాడు. రెజీనాలో టాలెంట్ ఉందని, అనతి కాలంలోనే అగ్ర నటిగా పేరు తెచ్చుకుంటోందని హరీష్ ప్రశంసించాడు. 'పవర్' సినిమాలో ఆమె నటన తనకు చాలా ఇష్టమని తెలిపాడు. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రంలో  సీత అనే పాత్రను రెజీనా చేస్తోందని, ఆ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని... రెజీనా కెరీర్లో ఈ పాత్ర గుర్తుండిపోతుందని హరీశ్ స్పష్టం చేశాడు.  

'శివ మనసులో శృతి' చిత్రం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై భామ అనతి కాలంలోనే మంచి మార్కులు కొట్టేసింది. అందంతో పాటు నటనలోనూ సత్తా చూపిస్తూ అగ్ర హీరోల సరసన అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకెళుతోంది.  తాజాగా హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రంలో సాయి ధరమ్ తేజ్తో రెండోసారి జత కట్టింది. (గతంలో వీరిద్దరూ  'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాలో నటించారు).

సుబ్రమణ్యం ఫర్ సేల్ ..ఆడియో ఈ నెల 23న శిల్పకళా వేదికలో విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా ఆడియో విడుదల కానుంది.  ఈ చిత్రానికి  మిక్కీ జే. మేయర్‌ సంగీతం సమకూర్చారు. కాగా చిరంజీవి నటించిన సినిమాలోని ఓ హిట్ సాంగ్ను ...సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంలో రీమిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement