సేల్ మొదలైంది..! | Mega Power Stylish Hero film ‘subramanyam for sale’ Launch News | Sakshi
Sakshi News home page

సేల్ మొదలైంది..!

Published Fri, Nov 28 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM

సేల్ మొదలైంది..!

సేల్ మొదలైంది..!

‘పిల్లా నువ్వు లేని జీవితం’తో హిట్ జంటగా పేరు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ్, రెజీనాలతో హరీశ్‌శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. ఈ చిత్రం షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, హీరో అల్లు అర్జున్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సాయిధరమ్‌తేజ్‌ని పూర్తి కమర్షియల్‌గా చూపించనున్నానని హరీశ్‌శంకర్ అన్నారు.

హరీశ్ సినిమాకు ముందు, తరువాత అనుకునేలా ఈ సినిమా ఉంటుందని సాయిధరమ్‌తేజ్ అభిప్రాయపడ్డారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ హైదరాబాద్‌లో, ఏప్రిల్ నుంచి అమెరికాలో జరిపే షెడ్యూల్స్‌తో షూటింగ్ పూర్తవుతుందనీ, వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తామనీ ‘దిల్’ రాజు తెలిపారు. ఈ చిత్రానికి కథనం: రమేశ్‌రెడ్డి, సతీశ్ వేగేశ్న, సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: సి.రాంప్రసాద్, కూర్పు: గౌతంరాజు, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement