
శివకుమార్ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ '22'. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు (జులై 22) రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. హీరోహీరోయిన్లపై విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, నవీన్ ఎర్నేని, కొండా కృష్ణం రాజు సంయుక్తంగా కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ముహూర్తపు షాట్‌కు భీమినేని శ్రీనివాస రావు గౌరవ దర్శకత్వం వహించారు.
హరీష్ శంకర్ చిత్ర దర్శకుడుకి స్క్రిప్ట్ అందించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ హాజరయ్యారు. కె.ఎస్. రవీంద్ర (బాబీ) సి.అశ్వనీదత్, కె.ఎస్. రామారావు, యం.యస్.రాజు, అనీల్ సుంకర, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, ఎస్.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కె.కె. రాధామోహన్, సముద్ర, నిమ్మకాయల ప్రసాద్, చిట్టూరి శ్రీనివాసరావు, సాగర్ తదితరులు హాజరై దర్శక నిర్మాతలకి, చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలి కాలంలో చిన్న సినిమాకి ఇంతమంది అతిథులు హాజరై శుభాకాంక్షలు తెలపడం విశేషం. కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథులందరికీ చిత్ర యునిట్ ధన్యవాదాలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment