సుబ్రమణ్యం రేట్ ఎంత? | Subramanyam For Sale In USA! | Sakshi
Sakshi News home page

సుబ్రమణ్యం రేట్ ఎంత?

Published Thu, Apr 2 2015 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM

సుబ్రమణ్యం రేట్ ఎంత?

సుబ్రమణ్యం రేట్ ఎంత?

 కొన్ని చిత్రాలు టైటిల్స్ నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’     ఆ కోవకే చెందుతుంది. సుబ్రమణ్యంని ఎందుకు అమ్మకానికి పెట్టారు? అతని రేటెంత? లాంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు కాదు.. థియేటర్లో చూడాల్సిందే. సాయిధరమ్ తేజ్, రెజీనా జంటగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
 
 ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఓ వైవిధ్యభరితమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రేమ, చక్కని కుటుంబ కథ కలగలిసిన చిత్రం ఇది. గత 20 రోజులుగా కోకాపేట హౌస్‌లో నిరవధికంగా చిత్రీకరణ జరుపుతున్నాం. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను, పాటలను చిత్రీకరిస్తాం. వచ్చే నెల అమెరికాలో భారీ షెడ్యూల్ మొదలుపెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: సి.రాంప్రసాద్, సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement