అమ్మకానికి సుబ్రమణ్యం | Subramanyam for Sale movie releases on 24th july | Sakshi

అమ్మకానికి సుబ్రమణ్యం

Jul 21 2015 11:00 PM | Updated on Sep 3 2017 5:54 AM

అమ్మకానికి సుబ్రమణ్యం

అమ్మకానికి సుబ్రమణ్యం

సుబ్రమణ్యాన్ని అమ్మకానికి పెడుతున్నారు. అదేంటి అనుకుంటున్నారా! అసలు....ఎవరా సుబ్రమణ్యం? ఏంటా కథ అనేది తెలియాలంటే

సుబ్రమణ్యాన్ని అమ్మకానికి పెడుతున్నారు. అదేంటి అనుకుంటున్నారా! అసలు....ఎవరా సుబ్రమణ్యం? ఏంటా కథ అనేది తెలియాలంటే ... సెప్టెంబర్ 24న విడుదల కానున్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చూడాల్సిందే. ‘పిల్లా నువు లేని జీవితం’, ‘రేయ్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇప్పుడు తన మూడో చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు.
 
  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకుడు. రెజీనా కథానాయిక. ‘‘హరీశ్ శంకర్ సంభాషణలు, సాయిధరమ్‌తేజ్ నృత్యాలు, పోరాటాలు, రెజీనా అందచందాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న పాటలను విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: తోట ప్రసాద్, రమేశ్ రెడ్డి, సతీశ్ వేగేశ్న, సంగీతం: మిక్కీ జె. మేయర్, ఎడిటింగ్: గౌతంరాజు, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement