చాలా కాలం తర్వాత రెజీనాకు గోల్డెన్‌ ఛాన్స్‌ | A Golden Chance For This Actress After A Long Time, Regina Cassandra Has Been Roped For Ajith Movie - Sakshi
Sakshi News home page

Regina Cassandra In Ajith 62nd Film: చాలా కాలం తర్వాత రెజీనాకు గోల్డెన్‌ ఛాన్స్‌

Oct 9 2023 2:15 PM | Updated on Oct 9 2023 2:53 PM

A Golden Chance For Regina After A Long Time - Sakshi

అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో నటి రెజీనాకు అవకాశం వరించినట్లు తాజా సమాచారం. చాలా కాలంగా పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్న అజిత్‌ 62వ చిత్రం ఎట్టకేలకు ఇటీవలే సెట్స్‌ పైకి వచ్చింది. విడాముయర్చి పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఆది నుంచి పలు మార్పులు చేర్పులకు గురవుతూ వస్తోంది. ఈ చిత్రానికి ముందుగా విగ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి వైదొలగడంతో ఆ తర్వాత దర్శకుడు మగిళ్‌ తిరుమేణి పేరు తెరపైకి వచ్చింది.

(ఇదీ చదవండి: నాకు ఇండస్ట్రీలో లైఫ్‌ ఇచ‍్చింది అతనే.. టాలీవుడ్‌పై షాయాజీ షిండే ఆసక్తికర కామెంట్స్!)

చిత్ర కథలోని చేర్పులు మార్పులు జరిగాయి. నటి త్రిష, బాలీవుడ్‌ భామ హ్యుమా ఖురేషీ హీరోయిన్లుగా, విలన్‌గా అర్జున్‌ దాస్‌ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా ఆ తర్వాత చిత్ర షూటింగ్‌ ఆలస్యం కావడంతో అర్జున్‌ దాస్‌ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి. దీంతో ఇప్పుడు ఆ పాత్రను నటుడు ఆరవ్‌ పోషిస్తున్నారు. కాగా చిత్ర షూటింగ్‌ ప్రారంభం అవుతున్న సమయంలో నటి హ్యుమా ఖురేషీ చిత్రం నుంచి తప్పుకున్నారు.

ఈమె ఇంతకుముందు అజిత్‌ జంటగా వలిమై చిత్రంలో నటించారు. కాగా ఇప్పుడు విడాముయర్చి చిత్రంలో ఆమెకు బదులు నటి రెజీనాను ఎంపిక చేసినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఈమెకు లక్కీ చాన్స్‌ అనే చెప్పాలి. ఇటీవల సరైన అవకాశాలు లేక వెబ్‌ సిరీస్‌ లో నటిస్తున్న రెజీనాకు ఈ చిత్రం నుంచి బ్రేక్‌ ఇస్తుందో లేదో చూడాలి. కాగా ఇన్ని మార్పులు చేర్పులు తర్వాత విడాముయర్చి చిత్రం షూటింగ్‌ అజర్‌బైజాన్‌ దేశంలో ప్రారంభమైంది. తదుపరి దుబాయ్‌ అబుదాబి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకొని చివరిగా చైన్నెలో షూటింగ్‌ను ముగించనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. కాగా దీనికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement