సినీ నటి రెజీనా నేత్రదానం | Regina Cassandra to Donate her Eyes | Sakshi
Sakshi News home page

సినీ నటి రెజీనా నేత్రదానం

Aug 10 2016 9:12 AM | Updated on Oct 20 2018 6:19 PM

నేత్రదానానికి సంతకం చేస్తున్న రెజీనా - Sakshi

నేత్రదానానికి సంతకం చేస్తున్న రెజీనా

ప్రముఖ సినీనటి (సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఫేమ్) రెజీనా రెజీనా కాసాండ్ర తన నేత్రాలను దానం చేస్తూ ప్రతిజ్ఞ చేశారు.

నెల్లూరు (అర్బన్): ప్రముఖ సినీనటి (సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఫేమ్) రెజీనా రెజీనా కాసాండ్ర తన నేత్రాలను దానం చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. తన మరణాంతరం అంధులకు తన నేత్రాలను అమర్చాలని కోరుతూ అంగీకారపత్రంపై మంగళవారం ఆమె నెల్లూరులో సంతకం చేశారు. నెల్లూరులోని డాక్టర్ అగర్వాల్ నేత్ర ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తన నేత్రదానాన్ని ప్రకటించారు. ఆస్పత్రిలోని ఐ-బ్యాంకును ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మన దేశంలో మూడు మిలియన్ల మంది అంధులు నేత్రదాతల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.

నెల్లూరు రూరల్, నగర నియోజకవర్గ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు శ్రీనివాసయాదవ్, రాజానాయుడు, ఆస్పత్రి సీఈవో డాక్టర్ అదిల్ అగర్వాల్, మెడికల్ డెరైక్టర్ డాక్టర్ శివప్రతాపరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement