రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌.. చేపను చూసేందుకు సిద్ధమా..! | Nani latest production project is ready to release | Sakshi
Sakshi News home page

రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌.. చేపను చూసేందుకు సిద్ధమా..!

Published Mon, Jan 29 2018 5:43 PM | Last Updated on Mon, Jan 29 2018 7:19 PM

Nani latest production project is ready to release - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్‌ స్టార్‌ నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘అ!’. నిత్యామీనన్, కాజల్ అగర్వాల్‌, రెజీనా, ఈషా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ విడుదల తేదీని వాల్‌ పోస్టర్‌ సినిమా గ్రూప్‌ భిన్నంగా ప్రకటించింది. వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీని ఫిబ్రవరి 16న విడుదల చేయనున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

‘అన్ని సినిమాలయందు ‘అ!’- సినిమా వేరయా!
విశ్వదాభిరామ ఫిబ్రవరి 16th రిలీజ్‌ రా మామా!!’
అంటూ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ట్వీటర్‌ లో పోస్ట్‌ చేశారు. చేప పాత్ర ఉందని చెప్పి అందరి దృష్టి ఆకర్షించిన యూనిట్‌, విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. చేప కథేంటో చూసేందుకు టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో రెండు కీలక పాత్రలకు నాని, రవితేజలు డబ్బింగ్ చెబుతున్నట్లు సమాచారం. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఒక్కో పోస్టర్ తో ఒక్కో పాత్రను ఇంట్రడ్యూస్‌ చేస్తూ వచ్చిన హీరో నాని, తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను అదే తీరుగా పద్యరూపంలో వెల్లడించాడు. మార్క్ కె రోబిన్ సంగీతమందిస్తున్న విషయం తెలిసిందే.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement