‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ గా రెజీనా, నివేదా థామస్‌ | Regina And Nivetha Thomas Play Key Role In Telugu Remake Of Midnight Runners | Sakshi
Sakshi News home page

‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ గా రెజీనా, నివేదా థామస్‌

Jul 27 2021 10:35 AM | Updated on Jul 27 2021 10:39 AM

Regina And Nivetha Thomas Play Key Role In Telugu Remake Of Midnight Runners - Sakshi

సౌత్‌ కొరియన్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ (2017) తెలుగులో రీమేక్‌ అవుతోంది. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి. సురేశ్‌బాబు, సునీత తాటి, హ్యూన్యూ థామస్‌ కిమ్‌లు ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ తెలుగు రీమేక్‌ను నిర్మిస్తున్నారు.

‘‘ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. ప్రస్తుతం ఫైనల్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్టు కల్లా పూర్తి చేయాలనుకుంటున్నాం. ఈ సినిమా కోసం రెజీనా, నివేదా థామస్‌ తొలిసారిగా డిఫరెంట్‌ స్టంట్స్‌ చేస్తున్నారు’’ అని చిత్రయూనిట్‌ వెల్లడించింది. ఇద్దరు కాబోయే పోలీసాఫీసర్లు కిడ్నాపర్ల ముఠాను ఎలా పట్టుకున్నారన్నదే ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ కథాంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement