
సాక్షి, హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘అ!’. వినూత్న కథాంశంతో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా భారీ స్పందన వస్తోంది. ‘చేపలకు కూడా కన్నీళ్లుంటాయి బాస్.. నీళ్లల్లో ఉంటాయి కదా అందుకే కనబడవు అంతే..’ అంటూ చేపకు హీరో నాని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.
దాంతో పాటు హర్రర్ బ్యాక్‌డ్రాప్ అన్నట్లుగా.. ‘నా డైరీలో లాస్ట్ ఎంట్రీ.. ఈరోజు నేనో మాస్ మర్డర్ చేయబోతున్నాను’ అంటూ వచ్చే డైలాగ్ సినిమాపై సస్పెన్స్ మొదలై భారీ అంచనాలను నెలకొనేలా చేస్తోంది. నిత్యామీనన్, కాజల్ అగర్వాల్, రెజీనా, ఈషా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 16న విడుదల కానుంది. కాగా, ఈ సినిమాలో రెండు కీలక పాత్రలకు నాని, రవితేజలు డబ్బింగ్ చెబుతున్నట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మార్క్ కె రోబిన్ సంగీతమందిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment