Regina Cassandra Reveals Interesting Things About Her Childhood, Deets Inside - Sakshi
Sakshi News home page

Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవి చాలా గ్రేట్‌

Jul 6 2022 5:46 PM | Updated on Jul 6 2022 7:05 PM

Regina Cassandra Reveals Interesting Facts - Sakshi

చిరంజీవిగారు ఈ వయసులో కూడా చాలా తొందరగా డ్యాన్స్‌ నేర్చుకున్నాడని, అది గొప్ప విషయమని తెలిపింది. ఇక తన విషయానికి వస్తే.. తనకు పాత్ర నచ్చితే అందుకోసం ఏదైనా చేస్తానంది. 2019లో కులుమనాలీలోని హోటల్లో ఐ మాస్క్‌ పెట్టుకుని నిద్రపోతున్నప్పుడు ఎవరో నుదురిని తాకినట్లు అనిపించిందని, మాస్క్‌ తీసేసి చూస్తే అక్కడ ఎవరూ లేరంటూ తనకు భయం వేసిన సంఘటనను వివరించింది.

హీరోయిన్‌ రెజీనా కసాండ్రా నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ అన్యాస్‌ ట్యుటోరియల్‌. ఈ సిరీస్‌ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమవుతోంది. ఈ సిరీస్‌ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చిన్నప్పుడే స్కూల్‌లో యాంకరింగ్‌ చేసేదాన్ని అని రెజీనా తెలిపింది. అంతేకాదు, క్లాస్‌ లీడర్‌గా ఉన్నప్పుడైతే ఏకంగా అబ్బాయిలను కొట్టేదాన్నని పేర్కొంది. దీంతో చాలామంది తాను డామినేటింగ్‌ అని చెప్తారని, తన ఫిజిక్‌ చూసి కూడా అందరూ డామినేటింగ్‌ అనుకుంటున్నారని చెప్పుకొచ్చింది.

ఆచార్య సినిమా విషయానికి వస్తే అందులో చిరంజీవిగారు ఈ వయసులో కూడా చాలా తొందరగా డ్యాన్స్‌ నేర్చుకున్నాడని, అది గొప్ప విషయమని తెలిపింది. ఇక తన విషయానికి వస్తే.. తనకు పాత్ర నచ్చితే అందుకోసం ఏదైనా చేస్తానంది. 2019లో కులుమనాలీలోని హోటల్లో ఐ మాస్క్‌ పెట్టుకుని నిద్రపోతున్నప్పుడు ఎవరో నుదురిని తాకినట్లు అనిపించిందని, మాస్క్‌ తీసేసి చూస్తే అక్కడ ఎవరూ లేరంటూ తనకు భయం వేసిన సంఘటనను వివరించింది.

కాగా కంద నాల్‌ ముదల్‌ అనే తమిళ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది రెజీనా. శివ మనసులో శ్రుతి(SMS) మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రొటీన్‌ లవ్‌ స్టోరీ, కొత్త జంట, పిల్లా.. నువ్వు లేని జీవితం, రారా కృష్ణయ్య, పవర్‌, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ వంటి హిట్‌ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె నేనే నా, శాకినీ ఢాకినీ సినిమాలు చేస్తోంది.

చదవండి: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శ్రుతి? హీరోయిన్‌ క్లారిటీ
జూలై రెండో వారం రిలీజవుతున్న సినిమాలు, సిరీస్‌ల లిస్టు ఇదిగో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement