
హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం మైఖేల్. తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో నటించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలైంది. ఈ సందర్భంగా రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతానికి తాను రిలేషన్‌షిప్‌లో లేనని, అయితే గతంలో ప్రేమలో పడి ఎదురుదెబ్బలు తగిలాయని పేర్కొన్నాడు.
'నేను చాలా ఎమోషనల్ పర్సన్. నాకు సంబంధించిన విషయాలన్నీ షేర్ చేసుకోవాలనుకుంటాను. నాలాంటి వ్యక్తికి రిలేషన్‌షిప్స్ చాలా డేంజరస్. అవి నాకు సెట్ కావని అర్థమైంది. గతేడాది బ్రేకప్ జరిగింది. ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటకు వస్తున్నా' అంటూ పేర్కొన్నాడు. కానీ గతంలో ఎవరితో లవ్‌లో ఉన్నాడన్న విషయం మాత్రం చెప్పలేదు. కాగా హీరోయిన్ రెజీనా కసాండ్రాతో సందీప్ డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన అందులో ఏమాత్రం నిజం లేదని తేల్చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment