30న 10కె రన్ | Regina cassandra in hyderabad 10k run | Sakshi
Sakshi News home page

30న 10కె రన్

Published Tue, Nov 25 2014 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

30న 10కె రన్

30న 10కె రన్

చిన్నా, పెద్దా... అన్ని వర్గాల వారినీ ఏకం చేసి... స్ఫూర్తిని నింపే హైదరాబాద్ 10కె రన్‌కు రంగం సిద్ధమైంది. ‘హైదరాబాద్ 10కె రన్ ఫౌండేషన్’ నెక్లెస్ రోడ్డులో నిర్వహించే ఈ పరుగు రూట్ మ్యాప్‌ను మంగళవారం హోటల్ గోల్కొండలో విడుదల చేశారు. నగర అడిషనల్ కమిషనర్ (ట్రాఫిక్) జితేందర్, భారత బ్యాడ్మింటన్ సంచలనం కె.శ్రీకాంత్, అందాల నటి రెజీనా కసాండ్రా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 30న ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ రన్ మొత్తం ప్రైజ్‌మనీ రూ.30 లక్షలు.

పాల్గొనాలనుకొనేవారు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి బుధవారం చివరి రోజు. ‘హైదరాబాద్ 10కె రన్ డాట్ కామ్’లో రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 29 ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య రిజిస్టర్ చేసుకున్నవారంతా కిట్స్ కలెక్ట్ చేసుకోవాలన్నారు. వివరాలకు 040-64646003/8125500340 నెంబర్లలో సంప్రదించవచ్చు. చైనా ఓపెన్ గెలిచిన సందర్భంగా శ్రీకాంత్‌కు ఫౌండేషన్ తరపున లక్ష రూపాయల నగదు బహుమతి అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement