కాన్సెప్ట్ వేవ్స్ ఆశ.. | Concept Waves hope | Sakshi

కాన్సెప్ట్ వేవ్స్ ఆశ..

Oct 13 2014 11:51 PM | Updated on Sep 2 2017 2:47 PM

కాన్సెప్ట్ వేవ్స్ ఆశ..

కాన్సెప్ట్ వేవ్స్ ఆశ..

మెట్రో పొలిస్ హ్యాకథాన్‌లో బెస్ట్‌గా నిలిచిన ఈ అప్లికేషన్ ఆడపిల్లల భద్రతకు నిజంగానే ఓ ‘ఆశా’దీపం. దీని రూపకర్త.. గువహటి ఐఐటి గ్రాడ్యుయేట్ రఘు కంచుస్తంభం. కాన్సెప్ట్ వేవ్స్ ఫౌండర్ అండ్ సీఈఓ కూడా.

మెట్రోపొలిస్ హ్యాకథాన్‌లో బెస్ట్‌గా నిలిచిన ఈ అప్లికేషన్ ఆడపిల్లల భద్రతకు నిజంగానే ఓ ‘ఆశా’దీపం. దీని రూపకర్త.. గువహటి ఐఐటి గ్రాడ్యుయేట్ రఘు కంచుస్తంభం. కాన్సెప్ట్ వేవ్స్ ఫౌండర్ అండ్ సీఈఓ కూడా. హైదరాబాద్‌కు చెందిన ఎమ్‌ఎస్‌ఎన్ కార్తీక్, శ్రీకాంత్ ‘ఆశ’కు ఆసరా ఇచ్చారు.  కార్తిక్ కూడా గువహటి ఐఐటీ గ్రాడ్యుయేటే. ఫిల్మ్‌టై్వన్ డాట్ కామ్ సంస్థకు కో ఫౌండర్. శ్రీకాంత్ కూడా కాన్సెప్ట్ వేవ్స్‌లో రఘుతో కలిసి పనిచేస్తున్నాడు.

ఈ ఆశ వెనక ఆలోచన?
ఆడపిల్లల మీద.. జరుగుతున్న లైగింకదాడుల గురించి పేపర్లలో చదివి కలత చెంది ఈ ఆశకు అంకురార్పణ చేశారు. గత జూలైలో బెంగళూరులోని ఆరేళ్ల పాప మీద టీచర్ చేసిన అఘాయిత్యానికి కలత చెందిన కిరణ్.. ఈ ఆలోచనకు కార్యరూపమిచ్చారు.
 
ఎలా పనిచేస్తుంది?
ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో చిన్నపిల్లల మీద జరుగుతున్న లైంగికదాడులను అరికట్టడానికి రూపుదిద్దుకుందీ ఆశ పోర్టల్. ఇది ఆధార్ కార్డ్ ఆధారంగా సమాజంలోని పాత నేరస్తులు, క్రిమినల్ కేసులు నమోదైన వాళ్ల గురించి వివరాలన్నిటినీ పొందుపరుస్తుంది. నగరంలోని ఏ స్కూల్లో అయినా.. ఇతరత్రా ఏ విద్యాసంస్థల్లోనైనా.. చివరకు రిహాబిలిటేషన్ సెంటర్స్‌లోనైనా ఎవరినైనా కొత్తగా ఉద్యోగంలో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ పోర్టల్‌లో సదరు వ్యక్తి పేరుతో ఉన్న వివరాలను ఒకసారి పరిశీలించాలి.

ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి చెప్తున్న వివరాలకు, ఆశ పోర్టల్‌లో ఉన్న వివరాలు సరిపోతే సదరు వ్యక్తి క్రిమినల్ అని తేలుతుంది. ఇంతేకాక స్కూల్లో ఒకవేళ ఇలాంటి అఘాయిత్యం జరిగితే టీచర్లుకాని, తల్లిదండ్రులు కానీ ఆ వ్యక్తిమీద వెంటనే ఫిర్యాదు చేయొచ్చు.  ‘ఈ అప్లికేషన్‌ను ప్రతి స్కూల్లో, ప్రతి విద్యాసంస్థలో మ్యాన్‌డేట్‌గా చేసేలా ప్రభుత్వం స్పందించాలి. పోలీస్, న్యాయ వ్యవస్థలూ ఈ పోర్టల్ సహాయం తీసుకోవాలని కోరుతున్నాం. ఈ పోర్టల్‌ని రిహాబిలిటేషన్ సెంటర్స్‌కీ అందుబాటులో ఉంచుతాం’ అని రఘు కంచుస్తంభం వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement