Kannada Actress Sanjana Galrani Welcomes Baby Boy | Azeez Pasha - Sakshi
Sakshi News home page

Actress Sanjjanaa Galrani: ఓ వైపు చెల్లి పెళ్లి, మరోవైపు బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌

Published Fri, May 20 2022 8:24 AM | Last Updated on Fri, May 20 2022 11:33 AM

Kannada Actress Sanjana Galrani Welcomes Baby Boy - Sakshi

బుజ్జిగాడు, సత్యమేవ జయతే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్‌ సంజనా గల్రానీ. ఇటీవలే గ్రాండ్‌గా సీమంతం జరుపుకున్న ఆమె తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన మహిళా డాక్టర్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించింది. బాబు పుట్టాడు, కంగ్రాచ్యులేషన్స్‌ అన్న క్యాప్షన్‌ను జోడిస్తూ సంజనతో దిగిన ఫొటోను నెట్టింట షేర్‌ చేసింది.

మరో వైపు సంజన చెల్లి నిక్కీ గల్రానీ పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. మే 18న ఆమె హీరో ఆది పినిశెట్టిని పెళ్లి చేసుకుంది. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ గుడ్‌న్యూస్‌ చెప్పడంతో ఫ్యాన్స్‌ ఇరువురికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా బిగ్‌బాస్‌ కన్నడ మాజీ కంటెస్టెంట్‌ అయిన సంజన గల్రానీ శాండల్‌ వుడ్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టయి మూడు నెలలు జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ప్రియుడు అజీజ్‌ పాషాను పెళ్లి చేసుకుంది.

చదవండి 👇

తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, అంతేకానీ..

విడాకుల బాటలో బాలీవుడ్‌ దంపతులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement