నిక్కిపాట్లు | kalakalappu-2 release in january | Sakshi
Sakshi News home page

నిక్కిపాట్లు

Published Tue, Oct 31 2017 5:07 AM | Last Updated on Tue, Oct 31 2017 5:07 AM

kalakalappu-2 release in january

తమిళసినిమా: జీవీ.ప్రకాశ్‌ నటించిన డార్లింగ్‌ చిత్రంతో తమిళంలోకి వచ్చిన అందాల తార నిక్కీగల్రాని. తొలి చిత్రంలోనే దెయ్యం పాత్రలో నటించి అందరిని భయపెట్టి అభిమానులను చూరగొంది ఈ చిన్నది. దీంతో ఈ అమ్మడికి తమిళంలో అవకాశాలు వెల్లువెత్తాయి. అయినా జయాపజయాలను సమానంగా పొందుతూ వస్తున్న నిక్కీగల్రాని హరహర మహాదేవ చిత్రంలో నటించి అడల్ట్‌ నటిగా మారింది. అంతే అనేక మంది దర్శక నిర్మాతలు నిక్కీగల్రాని అందాలను మరింత అందంగా చూపుతామని ముందుకొచ్చినా ఈ అమ్మడు వారి మాటలకు లొంగలేదు.

అంతేకాదు అడల్ట్‌ ఇమేజ్‌లో కొనసాగకూడదనే ఆమె ఇరుట్టి అరయిల్‌ మురట్టు కుత్తు (చీకటి గదిలో మొరటి పోట్లు) చిత్రంలో మళ్లీ గౌతమ్‌ కార్తీక్‌ సరసన నటించడానికి నిరాకరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సుందర్‌.సి రూపొందిస్తున్న కలగలప్పు–2 చిత్రంలో నటిస్తోంది. ఈ విషయం గురించి నిక్కీగల్రాని వివరిస్తూ కలగలప్పు–2 జనవరిలో విడుదలవుతుంది. హరహర మహాదేవ కామెడీ చిత్రం అయినప్పటికీ, అది అడల్ట్‌ ఓన్లీ చిత్రం అయ్యింది. కలగలప్పు–2 కూడా కామెడీ చిత్రమే. ఈ చిత్రం విడుదల తర్వాత తనపై ఉన్న అడల్ట్‌ చిత్రాల నాయిక ఇమేజ్‌ పోతుందనే నమ్మకంతో ఉన్నట్టు నిక్కీ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement