చెన్నై: తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన హీరోయిన్ నిక్కీ గల్రానీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె గురువారం ట్విటర్‌లో వెల్లడించారు. "నాకు గత వారం కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాగానే ఉన్నాను. కోలుకునేందుకు దగ్గర్లోనే ఉన్నా. నా ఆరోగ్యం కుదుటపడటం కోసం ప్రార్థిస్తున్నవారికి, ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు. అయితే కరోనా గురించి ప్రచారంలో ఉన్నవాటిని పక్కనపెడితే నా అనుభవాన్ని తెలియజేస్తున్నా. నాకు గొంతు నొప్పి, జ్వరం, వాసన, రుచి కోల్పోవడం వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటున్నాను. అయితే ఇంట్లోనే క్షేమంగా క్షేమంగా, సురక్షితంగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఇది క్లిష్ట సమయం అని తెలుసు. కానీ ఇప్పుడే జాగ్రత్తలు తీసుకుంటూ, ఎదుటివారి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం మరింత అవసరం." (మాలీవుడ్; అన్ లాక్)
"నా వయసు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నేను కరోనా నుంచి బయటపడతాననే భావిస్తున్నాను. కానీ నా తల్లిదండ్రులు, పెద్దలు, స్నేహితులకు వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కాబట్టి దయచేసి మాస్కు ధరించండి, భౌతిక దూరం పాటించండి, ఎల్లప్పుడూ చేతులు శుభ్రంగా కడుక్కోండి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి. అస్తమానం ఇంట్లోనే ఉండాలంటే చిరాకు వేస్తుందని తెలుసు. కానీ మనం కష్టకాలంలో జీవిస్తున్నాం. సమాజం కోసం మనవంతు సాయం చేయడానికి ఇదే సరైన సమయం. కుటుంబాలతో కలిసి ఆహ్లాదంగా గడపండి, స్నేహితులతో మాట్లాడుతూ ఉండండి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి" అని రాసుకొచ్చారు. కాగా నిక్కీ గల్రానీ "కృష్ణాష్టమి" చిత్రంలో సునీల్ సరన నటించారు. అలాగే డబ్బింగ్ మూవీ "మరకటమణి"లోనూ కనిపించి ఆకట్టుకున్నారు (హీరోయిన్ రిషికా సింగ్ కారుకు ప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment