ఆయనతో డ్యాన్స్ నేర్చుకోవడం సరికొత్త అనుభవం | The image will change, says Nikki Galrani | Sakshi
Sakshi News home page

ఆయనతో డ్యాన్స్ నేర్చుకోవడం సరికొత్త అనుభవం

Published Fri, Feb 19 2016 3:50 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

ఆయనతో డ్యాన్స్ నేర్చుకోవడం సరికొత్త అనుభవం - Sakshi

ఆయనతో డ్యాన్స్ నేర్చుకోవడం సరికొత్త అనుభవం

నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ వద్ద శిక్షణ పొందుతున్నాని తెలిపింది నటి నిక్కీగల్రాణి. ఫొటోగ్రాఫర్లకు హాట్ హాట్ ఫోజులిస్తూ సినీ వర్గాల దృష్టిని తనవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్న ఈ బ్యూటీ కోలీవుడ్‌లో ఇప్పటికే డార్లింగ్ చిత్రంలో సక్సెస్ ఖాతాను ప్రారంభించిందన్నది గమనార్హం. చేతి నిండా చిత్రాలున్న నిక్కీగల్రాణి తా జాగా తెలుగులో కూడా ఖాతా తెరిచింది. సునిల్‌కు జంటగా నటించిన కృష్ణాష్టమి చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. విశేషం ఏమిటంటే తమిళంలో ఆదితో నటించిన యాగవరాయనుమ్ నాకాక్క చిత్రం మలు పు పేరుతో అనువాదం అయి ఇదే రోజున విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలతో టాలీవుడ్‌లో ఏ మాత్రం ఆకర్షితురాలవుతుందో వేచి చూడాల్సిందే.
 
  ఈ క్యూట్‌బేబీ ఇప్పుడు రాఘవ లారెన్స్ వద్ద నృత్య రీతులు నేర్చుకుంటోందట. దీని గురించి నిక్కీగల్రాణి తెలుపుతూ ప్రతి చిత్రంలోనూ వైవిధ్యభరిత పాత్రలు పోషించాలని ఆశిస్తున్నానంది.లక్కీగా తనకు అలాంటి అవకాశాలే వస్తుండడం సంతోషంగా ఉందని చెప్పింది. తెలుగులో తాను నటించిన కృష్ణాష్టమి చిత్రం శుక్రవారం తెరపైకి రానుందని తెలిపింది. అందులో విదేశాల్లో నివశించే భారతీయ యువతిగా నటించానని చెప్పింది. ఇందు లో రచయిత్రిగా నటించడం వినూత్న అనుభవంగా పేర్కొంది.
 
 ఇక తమిళంలో డార్లింగ్ చి త్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యానని ఇక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వేలన్ను వందుట్టా వెళ్లక్కారన్, కో-2,మొట్టశివ కెట్టశివ చిత్రాల్లో నటిస్తున్నానని వెల్లడించింది. రాఘవ లారెన్స్‌కు జంటగా నటిస్తున్న మొట్టశివ కెట్టశివ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధిం చిన పటాస్ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోందని తెలిపింది. ఆర్‌బీ.చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయిరమణి దర్శకత్వం వహిస్తున్నారని చెప్పిం ది. ఈ చిత్రం కోసం రాఘవ లారెన్స్ వద్ద డాన్స్ నే ర్చుకుంటున్నానని ఆయన వద్ద డాన్స్ నేర్చుకోవడం సరికొత్త అనుభవం అని నిక్కీగల్రాణి పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement