హారర్ చిత్రాలొద్దు బాబోయ్ | i am not acting in Horror movies nikki galrani | Sakshi
Sakshi News home page

హారర్ చిత్రాలొద్దు బాబోయ్

Published Mon, Aug 29 2016 2:20 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

హారర్ చిత్రాలొద్దు బాబోయ్

హారర్ చిత్రాలొద్దు బాబోయ్

 హారర్ చిత్రంతో గుర్తింపు పొందిన నటి నిక్కీగల్రాణి ఇప్పుడలాంటి చిత్రాలు వద్దంటున్నారు. ఈ అమ్మడికి ఆదితో నటించిన యాగవరాయనుమ్ నాకాక్క తొలి చిత్రం అయినా తెరపైకి వచ్చిన మొదటి చిత్రం మాత్రం డార్లింగ్. జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో కలిసి తను హారర్ రొమాన్స్ చేసిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో వరుసగా అవకాశాలు నిక్కీగల్రాణి తలుపుతడుతున్నాయి.
 
  కో-2, వేల్లన్ను వందుట్టా వెళ్లక్కారన్ వంటి ఈ బ్యూటీ నటించిన చిత్రాలు ప్రేక్షకాదరణను పొందాయి. మధ్యలో దెయ్యం కథా చిత్రాల అవకాశాలు చాలా వచ్చాయట. దీని గురించి నిక్కీగల్రాణి తెలుపుతూ డార్లింగ్ చిత్రం తరువాత ఆ తరహా దెయ్యం చిత్రాల అవకాశాలు పలు వచ్చాయన్నారు. అయితే వరుసగా అలాంటివే చేస్తే దెయ్యం చిత్రాల నాయకి అనే ముద్రవేస్తారని భయంతో నిరాకరించానని చెప్పారు. అయితే ప్రతీకారం తీర్చుకునే పాత్రలు కాకుండా వైవిధ్యభరిత కథా పాత్రలైతే హారర్ చిత్రాలు చేయడానికి రెడీ అన్నారు.
 
 ప్రస్తుతం ఈ బ్యూటీ  కెట్టశివ మొట్టశివ, నెరుప్పుడా, కీ, కడవుల్ ఇరుక్కాన్ కుమారు, మరగద నాణయం అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే కెట్టశివ మొట్టశివ, కడవుల్ ఇరుక్కాన్ కుమారు, నెరుప్పుడా చిత్రాల్లో అందాలారబోతలో దుమ్మురేపుతున్నారట. ఈ చిత్రాలతో యువతకు మరింత దగ్గరవుతాననే నమ్మకాన్ని నిక్కీగల్రాణి వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement