
యువ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. ఎంతోకాలంగా ప్రేమలో ఉంటున్న ఈ లవ్ బర్డ్స్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్న విషయం తెలిసిందే. మే 24న నిశ్చితార్థం జరుపుకున్న ఈ ప్రేమజంట నేడు(మే 18న) పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రేమపక్షులు గత రెండు రోజులుగా పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో హల్దీ ఫంక్షన్ జరుపుకున్నారు. ఈ వేడుకలో పసుపు పచ్చని వస్త్రాలు ధరించిన వధూవరులు సంతోషంగా చిందులేశారు. నేచురల్ స్టార్ నాని, హీరో సందీప్ కిషన్ సైతం హల్దీ ఫంక్షన్‌కు హాజరై ఆదితో కలిసి డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత సంగీత్ ఫంక్షన్ కూడా ఘనంగా జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా ఆది, నిక్కీ.. ‘యాగవరైనమ్ నా కక్కా' సినిమాలో జంటగా నటించారు. తెలుగులో ఇది మలుపు పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలాగే మరగద నానయం సినిమాలోనూ వీరు జంటగా నటించారు. ఇదిలా ఉంటే ఆది పినిశెట్టి ప్రస్తుతం క్లాప్, వారియర్ సినిమాలు చేస్తున్నాడు.
#Sundeep Kishan and #Nani dance in joy at #AadhiPinisetty & #NikkiGalrani's haldi ceremony!! 🤩❤️@NameisNani @sundeepkishan @AadhiOfficial @nikkigalrani pic.twitter.com/um1K2Kd7B5
— Ramachandran Srinivasan (@indiarama) May 18, 2022
Lovable @AadhiOfficial & @nikkigalrani haldi function moments 💖😍#NikkiGalrani #Aadhi #AadhiWedsNikkiGalrani pic.twitter.com/MpFmnwNtrD
— Kodiyil Oruvan Gokul (@GMGokulOfficial) May 18, 2022
చదవండి 👇
Comments
Please login to add a commentAdd a comment