
ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్స్, సాంగ్స్‌ను ఆధారంగా చేసుకుని ...‘రంగస్థలం’ సినిమా ఓ ఫ్యామిలీ కమ్ క్యూట్ లవ్‌స్టోరీ అనుకుంటే పొరపాటే. రంగస్థలంలో రాజకీయాలు మస్త్ రంజుగా ఉన్నాయి. రంగస్థలం అనే గ్రామంలో సాగే రాజకీయ ఆధిపత్య పోరు నేపథ్యంలో సినిమా సాగుతుందని టాక్. ఇందుకు తగ్గట్లుగానే –‘‘రంగస్థలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా గ్రామప్రజలు బలపరిచిన కె.కుమార్‌బాబు లాంతరు గుర్తుకే మీ ఓటు ముద్రను వేసి గెలిపించండి’’ అని కుమార్ బాబు ఫొటోతో ఉన్న కరపత్రం ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన చిత్రం ‘రంగస్థలం’.
సమంత కథానాయిక. ఈ సినిమాలో వినికిడిలోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్, రామలక్ష్మీ పాత్రలో సమంత నటించారు. మరి.. సడన్‌గా కుమార్ బాబు ఎవరు? అంటే..ఆది పినిశెట్టి. మరి..కుమార్‌బాబు ఎన్నికల్లో గెలిచాడా? ప్రత్యర్థులు ఎవరు? రంగస్థలం రాజకీయాల్లో చిట్టిబాబు పాత్ర ఎంత? వంటి ఆసక్తికర వివరాలు తెలియాలంటే మాత్రం ‘రంగస్థలం’ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్, ఆది పినిశెట్టి అన్నదమ్ములుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 1985 కాలం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. ‘రంగస్థలం’ చిత్రాన్ని ఈనెల 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment