
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇంతవరకు తెరపై చూడని కొత్త చెర్రీని ప్రేక్షకులకు పరిచయం చేశాడు సుక్కు. చిట్టిబాబుగా చెర్రీ లుక్స్, నటన అందరిని ఆకట్టుకుందే. ఒక్క హీరోదే కాదు, ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రత్యేకమే. ముఖ్యంగా రంగమ్మత్త పాత్ర అయితే సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఆ పాత్రలో యాంకర్ అనసూయ పరకాయ ప్రవేశం చేసింది. తనదైన నటనతో అందరికి ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత అందరూ అనసూయను ‘రంగమ్మత్త’అని పిలవడం మొదలు పెట్టారు. అంతలా ఆ పాత్రలో జీవించేసింది హాట్ బ్యూటీ అనసూయ. ఈ సినిమా తర్వాత అనసూయకు వరుస ఆఫర్లు వచ్చాయి.
ప్రస్తుతం ఈ బ్యూటీ అటు షోలు, ఇటు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘రంగస్థలం’ షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలను పంచుకుంది. రంగస్థలం షూటింగ్ సమయంలో తన కోసం రామ్‌చరణ్ ప్రత్యేకంగా చెఫ్‌ని పిలిపించి వంట చేయించేవాడని చెప్పుకొచ్చింది.
‘సెట్లో భోజన సమయంలో చేపల కూర ఉండేది. కానీ నాకు చేపలు తినే అలవాటు లేదు. ఈ విషయం గ్రహించి రామ్‌చరణ్ నా కోసం ప్రత్యేకంగా చెఫ్‌ని పిలిపించి పన్నీర్‌ను పెద్ద ముక్కలుగా కట్ చేసి కూర వండించేవాడు. అది అచ్చం ఫిష్ కర్రీలా చాలా టేస్టీగా ఉండేది. స్టార్ హీరో స్థాయిలో ఉన్న రామ్ చరణ్ నాకోసం అలా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన నా కోసం అలా చెఫ్‌తో ప్రత్యేక వంటలు చేయించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది’అని షూటింగ్ జ్ఞాపకాలను మరోసారి గుర్తిచేసుకొని మురిసిపోయింది హాట్ బ్యూటీ అనసూయ. కాగా, ప్రస్తుతం అనసూయ ‘థాంక్యూ బ్రదర్’సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మే7 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు సుకుమార్, బన్నీ కాంబోలో వస్తున్న హ్యాట్రీక్ మూవీ ‘పుష్ప’లోనూ నటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment