తరగతి గదిలో ప్రేమ | Color Photo Movie Movie Song Will be Released On 27th August | Sakshi
Sakshi News home page

తరగతి గదిలో ప్రేమ

Published Wed, Aug 26 2020 8:32 AM | Last Updated on Wed, Aug 26 2020 8:32 AM

Color Photo Movie Movie Song Will be Released On 27th August - Sakshi

హాస్యనటుడు సుహాస్‌ హీరోగా, చాందీని చౌదరి హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘కలర్‌ ఫొటో’. సునీల్, వైవా హర్ష కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో సందీప్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో సాయి రాజేష్‌ నీలం, బెన్నీ ముప్పానేని, అమృత ప్రొడక్షన్‌ బ్యానర్‌పై శ్రవణ్‌ కొంక నిర్మించారు. కాలభైరవ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘తరగతి గదిలో...’ అంటూ సాగే మొదటి పాటను ఈ నెల 27న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సుహాస్‌ మాట్లాడుతూ–  ‘‘కమెడియన్‌గా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకి రుణపడి ఉంటాను. ఓ అందమైన, స్వచ్ఛమైన ప్రేమకథతో మా కలర్‌ ఫొటో రెడీ అయింది. సునీల్‌గారితో, చాందినీ చౌదరితో ఈ సినిమాలో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది’’అన్నారు. ‘‘డైరెక్టర్‌గా నాకు ఇది తొలి సినిమా అయినప్పటికీ నా స్నేహితుడు సుహాస్‌ హీరో కావడంతో ఎలాంటి బెదురు, టెన్షన్‌ లేకుండా సినిమా తెరకెక్కించాను’’ అన్నారు సందీప్‌ రాజ్‌. చాందినీ చౌదరి, లైన్‌ ప్రొడ్యూసర్‌ గంగాధర్, కెమెరామేన్‌ వెంకట్‌ ఆర్‌. శాఖమూరి తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: మణికంఠ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement