suhan
-
‘అంబాజీపేట..’ నటుడిగా సంతృప్తినిచ్చింది: సుహాస్
‘‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఫ్రెష్ సబ్జెక్ట్. సినిమా కొత్తగా ఉంటుంది. నటుడిగా నాకు సంతృప్తినిచ్చింది. ఒక మంచి సినిమా చూశామనే అనుభూతితో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకు వస్తారు’’ అని సుహాస్ అన్నారు. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మించాయి. ఈ చిత్ర సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరపరచిన ‘గుమ్మా....’ అంటూ సాగే తొలి పాటను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దుశ్యంత్ కటికినేని మాట్లాడుతూ– ‘‘ఈ పాటకి రెహ్మాన్ మంచి లిరిక్స్ ఇచ్చారు. ఈ సినిమాలోని పాటలన్నీ బాగుంటాయి’’ అన్నారు. ‘‘జనవరి నెలాఖరులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ధీరజ్ మొగిలినేని. ‘‘మంచి సినిమాలు ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘అంబాజీపేట..’ హిట్ కావాలి’’ అన్నారు నిర్మాత ఎస్కేఎన్. నటులు జగదీశ్, నితిన్, డ్యాన్స్ మాస్టర్ మోయిన్ తదితరులు మాట్లాడారు. -
‘రైటర్ పద్మభూషణ్’ కుటుంబాన్ని పరిచయం చేసిన సుహాస్
`కలర్‌ఫోటో` చిత్రంతో హీరోగా తొలి సక్సెస్ అందుకున్న సుహాస్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ చిత్రాల్లో `రైటర్ పద్మభూషణ్` ఒకటి. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఓ సాంగ్ మినహా ఎంటైర్ షూటింగ్ పూర్తయ్యింది. కొత్త ఏడాది సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు సుహాస్ పుట్టినరోజు సంరద్భంగా `రైటర్ పద్మభూషణ్` ఫ్యామిలీ పోస్టర్‌ను విడుదల చేశారు. సుహాస్ తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి, తల్లి పాత్రలో ప్రముఖ నటి రోహిణి నటిస్తున్నారు. ఈ బర్త్ డే స్పెషల్ పోస్టర్‌ను గమనిస్తే ఇందులో అందరూ సెలబ్రేషన్స్ మూడ్‌లో కనిపిస్తున్నారు. ష్మణుఖ ప్రశాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సుహాస్ అనేక ఇబ్బందులు పడే రైటర్ పాత్రలో కనిపించబోతున్నారు. మనోహర్ గోవింద స్వామి సమర్పణలో చాయ్ బిస్కట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ పతాకాలపై అనురాగ్, శరత్, చంద్రు మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
సుహాస్ ‘ఫ్యామిలీ డ్రామా’ ఫస్ట్‌లుక్ విడుదల
‘కలర్ ఫోటో’ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న తాజాగా చిత్రం ‘ఫ్యామిలీ డ్రామా’.మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఛష్మా ఫిలింస్, నూతన భారతి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యానర్లతో కలిసి తేజా కాసరపు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహెర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మంగళవారం విడుదలైంది. ఫ్యామిలీ డ్రామా’ అనే టైటిల్ కి భిన్నంగా ఈ పోస్టర్ ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో పాటు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. -
తరగతి గదిలో ప్రేమ
హాస్యనటుడు సుహాస్ హీరోగా, చాందీని చౌదరి హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘కలర్ ఫొటో’. సునీల్, వైవా హర్ష కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో సందీప్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని, అమృత ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రవణ్ కొంక నిర్మించారు. కాలభైరవ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘తరగతి గదిలో...’ అంటూ సాగే మొదటి పాటను ఈ నెల 27న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సుహాస్ మాట్లాడుతూ– ‘‘కమెడియన్‌గా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకి రుణపడి ఉంటాను. ఓ అందమైన, స్వచ్ఛమైన ప్రేమకథతో మా కలర్ ఫొటో రెడీ అయింది. సునీల్‌గారితో, చాందినీ చౌదరితో ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది’’అన్నారు. ‘‘డైరెక్టర్‌గా నాకు ఇది తొలి సినిమా అయినప్పటికీ నా స్నేహితుడు సుహాస్ హీరో కావడంతో ఎలాంటి బెదురు, టెన్షన్ లేకుండా సినిమా తెరకెక్కించాను’’ అన్నారు సందీప్ రాజ్. చాందినీ చౌదరి, లైన్ ప్రొడ్యూసర్ గంగాధర్, కెమెరామేన్ వెంకట్ ఆర్. శాఖమూరి తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: మణికంఠ. -
కలెక్టర్‌గారి భోజనం
ఆయన జిల్లా కలెక్టర్. రోజూ ఆఫీస్‌కు వస్తారు. క్యారేజీ తెచ్చుకోరు. హోటల్ నుంచి పార్శిల్ రాదు. సరిగ్గా భోజన సమయానికి ఆఫీస్ నుంచి మాయం అవుతారు. ఎక్కడికి వెళతాడు అనేగా మీ డౌట్! ఆయన స్కూల్‌కు వెళతారు. అవును. సరిగ్గా భోజనం సమయానికి స్కూల్‌కు వెళ్లే ఆ కలెక్టర్ అక్కడ పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. బిజీ షెడ్యూళ్లలో తప్పితే మిగతా ఎక్కువ రోజులు ఇలాగే చేస్తారు. ఇంతకీ ఎవరా కలెక్టర్?! కేరళ రాష్ట్రం అలపుళ జిల్లా. కలెక్టర్ ఎస్.సుహాన్. 2012 ఐ.ఎ.ఎస్. బ్యాచ్‌కి చెందిన ఈయన ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. వచ్చీరాగానే జిల్లాలోని పాఠశాలల్లో బోధన, సౌకర్యాలపై దృష్టి పెట్టారు. మొన్నటికి మొన్న మధ్యాహ్న సమయంలో నీరుకున్నమ్‌లోని శ్రీ దేవి విల్సమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌కు వెళ్లారు.. సరిగ్గా పిల్లలు భోజనం చేసే సమయంలోనే. కలెక్టర్ వచ్చారని అందరూ హడావుడి చేస్తుంటే.. సుహాన్ నేరుగా డైనింగ్ హాలులోకి వెళ్లారు. ఓ ప్లేట్ తీసుకున్నారు. పిల్లల మధ్య కూర్చుని భోజనం చేశారు. ఆ రోజు కూరలు దోసకాయ, ఆలుగడ్డ. పెరుగు కూడా ఉంది. పిల్లల మధ్య మధ్యాహ్న భోజనం చేస్తూనే.. ‘ఎలా ఉంది?’ అని అడిగి తెలుసుకున్నారు. ఇది ఒక్క రోజు జరిగిన ‘డ్రైవ్’ కాదు. అంతకుముందు ఆయన వయనాడ్ జిల్లా కలెక్టర్‌గా కూడా పనిచేశారు. అప్పుడు కూడా ఇలాగే గిరిజన పాఠశాలలపై దృష్టి పెట్టారు. రోజుకొక గిరిజన పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తూ ఉపాధ్యాయులకు షాక్ ఇచ్చేవారు. దీంతో అటవీ ప్రాంతంలోని గిరిజన పాఠశాల విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఒక్కో పాఠశాలలో 30 మంది స్టూడెంట్స్ చేరారు. జస్ట్ ఒక్క సంవత్సరంలోనే ఈ మార్పు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఇటీవలే అలపుళ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు కలెక్టర్ సుహాన్. దీని వల్ల మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెరుగు తుందని, విద్యార్థుల చదువుపైనే కాకుండా ఆరోగ్యంపైన కూడా శ్రద్ధ పెట్టటానికి వీలవుతుంది అన్నారు. పిల్లల తల్లిదండ్రుల్లోనూ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఏర్పడుతుం దన్నారు. -
థైరోసినేమియా వ్యాధితో బాలుడి మృతి
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : డిచ్పల్లి మండల కేం ద్రానికి చెందిన సుహాన్ అనే నాలుగేళ్ల బాలుడు థైరోసినేమియా అనే కాలేయ సంబంధిత వ్యాధి తో మృతిచెందాడు. ఆదివారం బాలుడి తల్లి సమీరా, మేనమామ సల్మాన్ డిచ్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. వారు చెప్పిన ప్రకారం.. సుహాన్ గత ఆగస్టులో ఆనారోగ్యానికి గురికాగా తల్లి సమీరా జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యులకు చూయించింది. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యపరీక్షలు జరిపించింది. బాలుడికి థైరోసినేమియా వ్యాధి సోకినట్లు అక్కడి వైద్యులు చెప్పారు. ఈ వ్యాధి చికిత్స కోసం సుమారు రూ 19 లక్షలు ఖర్చవుతుందని, లక్షల్లో ఒకరికి ఇలాంటి వ్యాధి వస్తుందని వైద్యులు తెలిపా రు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్సతో వ్యాధిని నయం చేయవచ్చని వైద్యులు సూచించారు. పేద కుటుంబం కావడంతో అంత డబ్బులు తేవాలో తెలియక బాలుడి కుటుంబం తల్లడిల్లింది. బాలుడి తండ్రి షబ్బీర్ కుటుంబపోషణ నిమిత్తం దుబాయ్‌కు వెళ్లాడు. దీంతో తల్లి సరీనా, మేనమామ సల్మాన్‌లు సుహాన్‌ను పట్టుకుని పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయాలని వైద్యుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. గత రచ్చబండలో తమకు ప్రభుత్వం ఇచ్చిన రేషన్‌కార్డు కూపన్ పనిచేయదని చెప్పారు. ఇటీవల డిచ్పల్లి, జక్రాన్‌పల్లి మండల కేంద్రాల్లో జరిగిన ఆరోగ్యశ్రీ మెగా వైద్య శిబిరాలకు వెళ్లి వైద్యులను సంప్రదించినా ఎవరూ సరైన విధంగా స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి ప్రాణాలు రక్షించుకునేందుకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదన్నారు. తమ కుమారుడికి జరిగిన అన్యాయం మరొక చిన్నారికి జరగ కుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లి సమీరా విలేకరుల ఎదుట బోరున విలపించింది.బాధిత కుటుంబం స్వగ్రామం నందిపేట్ మండలం కౌల్పూర్ కాగా, కొద్ది నెలలుగా డిచ్పల్లి మండల కేంద్రంలో నివసిస్తున్నారు.