`కలర్‌ఫోటో` చిత్రంతో హీరోగా తొలి సక్సెస్ అందుకున్న సుహాస్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ చిత్రాల్లో `రైటర్ పద్మభూషణ్` ఒకటి. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఓ సాంగ్ మినహా ఎంటైర్ షూటింగ్ పూర్తయ్యింది.
కొత్త ఏడాది సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు సుహాస్ పుట్టినరోజు సంరద్భంగా `రైటర్ పద్మభూషణ్` ఫ్యామిలీ పోస్టర్‌ను విడుదల చేశారు. సుహాస్ తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి, తల్లి పాత్రలో ప్రముఖ నటి రోహిణి నటిస్తున్నారు. ఈ బర్త్ డే స్పెషల్ పోస్టర్‌ను గమనిస్తే ఇందులో అందరూ సెలబ్రేషన్స్ మూడ్‌లో కనిపిస్తున్నారు.
ష్మణుఖ ప్రశాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సుహాస్ అనేక ఇబ్బందులు పడే రైటర్ పాత్రలో కనిపించబోతున్నారు. మనోహర్ గోవింద స్వామి సమర్పణలో చాయ్ బిస్కట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ పతాకాలపై అనురాగ్, శరత్, చంద్రు మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Writer Padma Bhushan: ‘రైటర్ పద్మభూషణ్’ కుటుంబాన్ని పరిచయం చేసిన సుహాస్
Published Thu, Aug 19 2021 6:04 PM | Last Updated on Thu, Aug 19 2021 6:29 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment