
‘‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఫ్రెష్ సబ్జెక్ట్. సినిమా కొత్తగా ఉంటుంది. నటుడిగా నాకు సంతృప్తినిచ్చింది. ఒక మంచి సినిమా చూశామనే అనుభూతితో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకు వస్తారు’’ అని సుహాస్ అన్నారు. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ నిర్మించాయి.
ఈ చిత్ర సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరపరచిన ‘గుమ్మా....’ అంటూ సాగే తొలి పాటను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దుశ్యంత్ కటికినేని మాట్లాడుతూ– ‘‘ఈ పాటకి రెహ్మాన్ మంచి లిరిక్స్ ఇచ్చారు. ఈ సినిమాలోని పాటలన్నీ బాగుంటాయి’’ అన్నారు. ‘‘జనవరి నెలాఖరులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ధీరజ్ మొగిలినేని. ‘‘మంచి సినిమాలు ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘అంబాజీపేట..’ హిట్ కావాలి’’ అన్నారు నిర్మాత ఎస్‌కేఎన్. నటులు జగదీశ్, నితిన్, డ్యాన్స్ మాస్టర్ మోయిన్ తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment