నటుడు, కమెడియన్ వైవా హర్ష బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైంది. ఈ మేరకు వైవా హర్ష ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'చివరి బ్యాచిలర్ సెల్ఫీ' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. అలాగే కాబోయే భార్య అక్షరతో నేడు(శనివారం) నిశ్చితార్థం జరుపుకున్న ఫొటోలను స్టోరీస్‌లో యాడ్ చేశాడు. ఇందులో జీవితాంతం తను వేలు పట్టుకుని నడవనున్న అక్షర మెడలో దండ వేసి సగం పెళ్లి కానిచ్చేశాడు. తర్వాత ఆమెతో కలిసి కేక్ కట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: భార్యను ఏడిపించిన సింగర్)
దీంతో పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా స్టార్లు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక పెళ్లెప్పుడన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తన డైలాగులు, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల మనసు దోచుకున్న వైవా హర్ష సూపర్ డూపర్ హిట్ చిత్రం కలర్ ఫొటోలో నటించారు. ఇందులో తనదైన శైలిలో కామెడీ పండించి అందరికీ వినోదాన్ని పంచారు. (చదవండి: చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను : నిహారిక)
Comments
Please login to add a commentAdd a comment