Young Director, Actor Venky Atluri Engagement Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Director, Actor Venky Atluri: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న డైరెక్టర్‌ వెంకీ అట్లూరి

Published Sat, Dec 10 2022 3:16 PM | Last Updated on Sat, Dec 10 2022 4:08 PM

Young Director, Actor Venky Atluri Engagement Photos Goes Viral - Sakshi

ప్రముఖ నటుడు, డైరెక్టర్‌ వెంకీ అట్లూరి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పూజా అనే అమ్మాయితో త్వరలో ఆయన ఏడడుగులు వేయబోతున్నాడు. కొద్దిమంది ఇండస్ట్రీ సన్నిహితుల మధ్య సీక్రెట్‌గా, నిరాండబరంగా వెంకీ అట్లూరీ నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశాడు. దీంతో ఈ ఫొటోలు సోషల్‌ మీడియా వైరల్‌గా మారాయి. వెంకీ అల్లూరీ నిశ్చితార్థం ఫొటోలు చూసి సినీ నటీనటుల, ప్రముఖు, ఫాలోవర్స్‌ నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ వేడుకు ప్రముఖ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ భార్య, మహానటి, సీతారామం చిత్రాల నిర్మాత స్వప్నదత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

కాగా వెంకీ అల్లూరి జ్ఞాపకం అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత స్నేహగీతం చిత్రంలో నటించడమే కాకుండా ఈ మూవీకి డైలాగ్స్‌ అందించాడు. ఆ తర్వాత కేరింత, ఇట్స్‌ మై లవ్‌స్టోరీ చిత్రాలకు రైటర్‌గా పనిచేశాడు. ఇక వరుణ్‌ తేజ్‌-రాశిఖన్నా తొలిప్రేమ మూవీతో డైరెక్టర్‌గా మారి తొలి హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత మిస్టర్‌ మజ్ను, రంగ్‌దే చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం తమిళ స్టార్‌ హీరో ధనుష్‌తో సార్‌ మూవీ చేస్తున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. 

చదవండి: 
ఎయిర్‌పోర్టులో తారక్‌, మళ్లీ ఫ్యామిలీతో విదేశాలకు! నిరాశలో ప్యాన్స్‌
మహేశ్‌ బాబు భార్య నమ్రత కొత్త రెస్టారెంట్‌, రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement