12th ఫెయిల్‌.. అలాంటి పాత్రలే చేయాలని లేదు: హీరోయిన్‌ | Actress Medha Shankar Says Took Time To Transition Away From 12th Fail Character, Deets Inside | Sakshi
Sakshi News home page

ఈసారి బర్త్‌డే స్పెషల్‌గా.. అలాంటి పాత్రలే వద్దు!: హీరోయిన్‌

Published Thu, Aug 1 2024 12:35 PM | Last Updated on Thu, Aug 1 2024 1:37 PM

Medha Shankar: Took Time to Transition Away from 12th Fail Character

కష్టే ఫలి అన్న సూత్రాన్ని నమ్ముకుంది మేధా శంకర్‌. 2019లో వెండితెరపై ప్రయాణం మొదలుపెట్టింది. రెండు సినిమాలు, రెండు సిరీస్‌లు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ మూడో సినిమాకు తన జాతకమే మారిపోయింది. గతేడాది వచ్చిన 12th ఫెయిల్‌ మూవీతో ఈ బ్యూటీ దశ తిరిగిపోయింది. నేడు (ఆగస్టు 1) మేధా శంకర్‌ బర్త్‌డే.

12th ఫెయిల్‌ బ్లాక్‌బస్టర్‌..
ఈసారి తన 27వ పుట్టినరోజును విల్లాలో ప్లాన్‌ చేసుకుందట. తన ఫ్యామిలీతో కలిసి మూడు రోజులపాటు అక్కడే ఉండి ఇష్టమైన ఫుడ్‌ తింటూ నచ్చిన ఆటలు ఆడేస్తానంటోంది. సినిమాల గురించి చెప్తూ.. '12th ఫెయిల్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ.. అందులో నేను పోషించిన శ్రద్ధ జోషి పాత్రను ప్రేక్షకులు ప్రేమించారు. మళ్లీ అలాంటిపాత్రలోనే చూడాలని ఆశపడుతున్నారు. కానీ ఆ తరహా రోల్స్‌కే పరిమితమైపోవాలని అనుకోవడం లేదు. ఆ ఇమేజ్‌ నుంచి బయటపడేందుకు కాస్త బ్రేక్‌ తీసుకున్నాను. నా కెరీర్‌లో అన్నిరకాల సినిమాలు చేయాలనుంది' అని చెప్పుకొచ్చింది.

రీప్లేస్‌..
నోయిడాలో పుట్టి పెరిగిన మేధా శంకర్‌కు సంగీతమంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. హిందుస్థానీ సంగీతంలో శిక్షణ తీసుకుంది. తర్వాత మోడలింగ్‌లో రాణించింది. విత్‌ యు ఫర్‌ యువర్‌ ఆల్వేస్‌ అనే షార్ట్‌ ఫిలింలో నటించింది. బీచమ్‌ హౌస్‌, దిల్‌ బేకరార్‌ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకుంది. ఓ మూడు పెద్ద చిత్రాల్లో ఛాన్సులు వచ్చినా చివరికి తనను తీసేసి వేరే హీరోయిన్లకు అవకాశాలిచ్చారు. అయినా మంచి స్క్రిప్టులు ఎంచుకుని తనకంటూ క్రేజ్‌ సంపాదించింది.

చదవండి: ఓటీటీలోనే సూపర్ హిట్ వెబ్ సిరీస్.. రెండో సీజన్ రిలీజ్ ఫిక్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement