ఫ‌స్ట్ టైమ్ బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన మౌనిక‌ | Bhuma Mounika Shares Baby Bump Photos, Manoj Reaction Is Adorable Goes Viral - Sakshi
Sakshi News home page

Bhuma Mounika Baby Bump Photos: బేబీ బంప్‌తో మౌనిక‌.. పిల్లా నువ్వంటే ప్రాణ‌మ‌న్న మ‌నోజ్‌

Published Sat, Feb 24 2024 2:20 PM | Last Updated on Sat, Feb 24 2024 5:33 PM

Bhuma Mounika Shares Baby Bump Photos, Manoj Reaction is Adorable - Sakshi

మంచు మ‌నోజ్, భూమా మౌనిక గ‌తేడాది పెళ్లి చేసుకున్నారు. అప్ప‌టినుంచి వీరికి అన్నీ క‌లిసొస్తున్నాయి. కొన్నేళ్లుగా వెండితెర‌కు దూరంగా ఉన్న మ‌నోజ్ కొత్త సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. అలాగే ప్ర‌స్తుతం ఓ షో కూడా చేస్తున్నాడు. ఇక మౌనిక కొత్త బిజినెస్ మొద‌లుపెట్టింది. పిల్ల‌ల కోసం ఆట‌వ‌స్తువులు, బొమ్మ‌లు త‌యారు చేసి అమ్మే కంపెనీ మొద‌లుపెట్టింది. 

ప్రెగ్నెన్సీ..
బాహుబ‌లి, స‌లార్‌, ఆర్‌ఆర్‌ఆర్‌, రోబో... ఇలా సినిమాల్లోని ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ల‌ను బొమ్మ‌ల రూపంలో తీసుకువ‌చ్చేందుకు మ‌నోజ్‌-మౌనిక దంప‌తులు ప్ర‌య‌త్నిస్తున్నారు. కెరీర్ ప‌రంగానే కాకుండా వ్య‌క్తిగ‌తంగానూ వీళ్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో ఈ జంట ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ధైర‌వ్‌తో ఆడుకునేందుకు మ‌రో బుజ్జాయి ఈ ప్ర‌పంచంలోకి రానుందంటూ మౌనిక త‌న‌ ప్రెగ్నెన్సీ ప్ర‌క‌టించింది. తాజాగా ఆమె త‌న బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది.

నువ్వు నా ప్రాణం..
'నా ఈ జీవితం.. నాతో పాటు ఎల్ల‌ప్పుడూ ప‌క్క‌నే ఉన్న‌వాళ్ల‌ను ఆక‌ర్షిస్తుంది. వారితో న‌న్ను మ‌ళ్లీ మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డేలా చేస్తుంది' అంటూ మ‌నోజ్‌ను, త‌న మొద‌టి కుమారుడు ధైర‌వ్‌ను ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్‌కు మ‌నోజ్ స్పందిస్తూ.. 'పిల్లా ఓ పిల్లా నువ్వంటే నాకు ప్రాణ‌మే' అని కామెంట్ చేశాడు. ప్ర‌స్తుతం మౌనిక బేబీ బంప్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement