Manchu Lakshmi Adopted 50 Government Schools In Bhuvanagiri District - Sakshi
Sakshi News home page

Lakshmi Manchu: మంచు లక్ష్మి గొప్ప మనసు, గవర్నమెంట్‌ స్కూళ్లు దత్తత

Published Thu, Jul 21 2022 7:03 PM | Last Updated on Thu, Jul 21 2022 7:47 PM

Manchu Lakshmi Adopted 50 Government Schools - Sakshi

సినీ నటి మంచు లక్ష్మి గొప్ప నిర్ణయం తీసుకుంది. 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 గవర్నమెంట్‌ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేటు పాఠశాలలను మరిపించేలా స్మార్ట్‌ క్లాసెస్‌ ప్రారంభిస్తామని తెలిపింది. 1 నుంచి 5 తరగతుల వరకు మూడు సంవత్సరాల పాటు స్మార్ట్‌ క్లాసెస్‌ నిర్వహిస్తూనే, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది.

పిల్లలు చదువు మధ్యలో ఆపేయకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.​ మంచు లక్ష్మి చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు అభిమానులు. పిల్లల చదువుకు పెద్దపీట వేసే ఈ ముందడుగు తప్పకుండా విజయవంతం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: 'నిప్పు' హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement