Manchu Lakshmi Tweet About Sai Dharam Tej: యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై సినీ ప్రముఖులు వరుసగా స్పందిస్తున్నారు. అంతేకాదు యాక్సిడెంట్ విషయం తెలిసి నేరుగా ఆస్పత్రికి వెళ్లి సాయి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మీ కూడా మధ్యాహ్నం అపోలో ఆసుపత్రికి వెళ్లి సాయి తేజ్‌ను చూసి వచ్చిన సంగతి తెలిసిందే. అతడి ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడి తెలుసుకుంది. ఆనంతరం తిరిగి వెళ్లిన మంచు లక్ష్మీసాయికి జరిగిన ప్రమాదం గురించి సోషల్‌మీడియాలో వస్తోన్న వార్తలపై స్పందించింది.
చదవండి: Sai Dharam Tej Accident: ‘ఈ సమయంలో రాజకీయాలు చేయకండి’
ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘తేజ్ బాధ్యత కలిగిన వ్యక్తి. నాకు తెలిసినంతవరకూ తేజ్ ఎంతో బాధ్యతాయుతమైన పౌరుడు. అతను ఏక్షణంలోనూ రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడు. రోడ్డుపై ఉన్న మట్టి వల్లే అతనికి ఈ ప్రమాదం జరిగిందని అక్కడ క్లియర్‌గా తెలుస్తోంది. కాబట్టి దయచేసి ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయకండి. ఇప్పుడు అతను క్షేమంగానే ఉన్నాడు. సాయి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిద్దాం’ అంటూ రాసుకొచ్చింది.
Tej is one of the most responsible citizens that I know. It is very clear that he wasn’t speeding at any given moment. There was mud on the road that led to the accident. I request all of you to stop spreading rumours.
— Lakshmi Manchu (@LakshmiManchu) September 11, 2021
అలాగే ఆమె తమ్ముడు, హీరో మంచు మనోజ్ కూడా మీడియాతో మాట్లాడాడు. సాయి ధరమ్ తేజ్ వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నా అని ఆయన లాంటి మంచి వ్యక్తి దొరకరు సచ్ స్వీట్ హాట్ అని పేర్కొన్నాడు. అంతేగాక ఆయనపై దయచేసి ఎవరూ చెడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. ఇక సాయి ధరమ్‌కు జరిగిన ప్రమాదం స్పాట్‌కు వెళ్లి చూశానని, తరచూ మేము వెళ్లే స్పాట్ అన్నాడు. సాయి ప్రమాదం జరగానే వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించిన వారికి మనోజ్ కృతజ్ఞతలు తెలిపాడు.
చదవండి: నరేశ్ కామెంట్స్ నాకు ఇబ్బందిగా అనిపించాయి: శ్రీకాంత్
ఇదిలా ఉండగా సాయి ప్రమాదంపై సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాత నటుడు బండ్ల గణేష్ ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరైనది కాదంటూ సోషల్ మీడియాలో వీడియో వదలగా.. హీరో శ్రీకాంత్ నరేశ్ వ్యాఖ్యలు తనకు ఇబ్బందిగా అనిపించాయంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా నరేశ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రమాదానికి ముందు సాయి తమ ఇంటి నుంచే బయలు దేరారని, సాయి ధరమ్ తేజ్ ఆయన అబ్బాయి నవీన్ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పారు. అంతేగాక వారు క్రమంగా బైక్ రేసుల్లో పాల్గొంటున్నారంటూ నరేశ్ వ్యాఖ్యానించారు. అలాగే వేగం విషయంలో యువత కంట్రోల్‌లో ఉండాలని, కోటా శ్రీనివాస రావు, బాబు మోహన్, కోమటి రెడ్డిల కుమారులు ఇలాటే ప్రమాదాల్లో మరణించి వారి కటుంబాలను శోక సంద్రంలో ముంచారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
చదవండి: కన్‌స్ట్రక్షన్ కంపెనీ, మున్సిపాలిటీపై కూడా కేసు పెట్టాలి: ఆర్పీ
Comments
Please login to add a commentAdd a comment