Mohan Babu Talk With Balakrishna In Unstoppable Talk Show on AHA - Sakshi
Sakshi News home page

Unstoppable Talk Show: చిరంజీవిపై మోహన్‌ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Published Thu, Nov 4 2021 4:05 PM | Last Updated on Thu, Nov 4 2021 7:56 PM

Mohan Babu Talk With Balakrishna In Unstoppable Talk Show In AHA - Sakshi

నంద‌మూరి బాల‌కృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో వస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. ఇటీవల లాంచ్‌ చేసిన ఈ టాక్‌ షో తొలి ఎపిసోడ్‌కు డైలాగ్‌ కింగ్‌ మోహన్‌ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి, కుమారుడు మంచు విష్ణు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా ఫస్ట్ షో ఎపిసోడ్‌ గురువారం విడుదలైంది. ఇందులో మోహన్‌ బాబు, బాలయ్య ఫుల్‌ సందడి చేస్తూ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచారు. ఈ క్రమంలో మోహన్‌ బాబు, బాలయ్య ఒకరిపై ఒకరూ ప్రశ్నల సంధించుకున్నారు. దీంతో ఈ టాక్‌ షో మరింత ఆసక్తిగా సాగింది. ఇలా ఆసక్తిగా సాగుతున్న షో మధ్యలోకి మంచు విష్ణు, మంచు లక్ష్మీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది, బాలయ్య, మోహన్‌ బాబు ఏమేం చర్చించుకన్నారో ఇక్కడ ఓ లుక్కేయండి. 

చదవండి: మెగా ఇంట్లో దీపావళి సంబరాలు, ఫొటో షేర్‌ చేసిన బన్నీ

ఈ సందర్భంగా మోహన్‌ బాబు ఎన్టీఆర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఒకరోజు ఎన్టీఆర్‌తో నేను ‘అన్నయ్యా.. మీతో నేను ఓ సినిమా చేస్తా’మ అని అడిగాను. దానికి ఆయన రాజకీయాల్లో ఫేయిల్‌ అయ్యాను. ఇక సినిమాలు ఎవరు చూస్తారు అనవసరంగా డబ్బు వృధా చేసుకోవద్దు’ అంటూ బదులిచ్చారు. అలా నాకు సలహా ఇచ్చి మరోసారి తన గొప్పతనాన్ని పంచుకున్నారు’’ అంటూ మోహన్‌ బాబు ఎమోషనల్‌ అయ్యారు. సినిమా కేరీర్‌ తాను వ్యక్తిగతం చాలా ఇబ్బందులు పడ్డానని, తన బ్యానర్లో వరస సినిమాలు ప్లాప్‌ అయితే భూములు అమ్మి డబ్బులు చెల్లించానంటూ కన్నీరు పెట్టుకున్నారు.

చదవండి: శివబాలాజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మధుమిత

ఆ తర్వాత ‘అసెంబ్లీ రౌడీ, అల్లుడుగారు, పెదరాయుడు, బ్రహ్మ’ చిత్రాల విజయాలతో మళ్లీ నిలదొక్కుకున్నానని చెప్పారు. అనంతరం షోలో భాగంగా చిరంజీవిపై మీ అభిప్రాయం ఏంటని బాలయ్య అడగ్గా.. ‘వ్యక్తిగతంగా చిరంజీవిపై నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. ఆయన మంచి నటుడు. అంతకుమించి అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తాడు. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేశాను. అల్లు రామలింగయ్యగారి కూతురు సురేఖను పెళ్లి చేసుకున్నాడు. సురేఖ నాకు సోదరిలాంటిది. అంటే మన ఇంటి అమ్మాయిని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు.. కాబట్టే అతను బాగున్నాడు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement