శివకాశి లక్ష్మీబాంబ్! | Lakshmi Bomb movie in Manchu Lakshmi Prasanna | Sakshi
Sakshi News home page

శివకాశి లక్ష్మీబాంబ్!

Published Fri, May 20 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

శివకాశి లక్ష్మీబాంబ్!

శివకాశి లక్ష్మీబాంబ్!

దీపావళి పండగంటే మనకు గుర్తొచ్చేది శివకాశీ టపాసులు. ఆ టపాసుల్లో లక్ష్మీబాంబ్ చాలా పవర్‌ఫుల్. అటువంటి ‘లక్ష్మీబాంబ్’ పేరుతో మంచు లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనికా చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఆరంభమైంది. ఉపశీర్షిక- ‘ఫ్రమ్ శివకాశి’. ముహూర్తపు సన్నివేశానికి హీరో మంచు మనోజ్ కెమేరా స్విచ్చాన్ చేయగా, మరో హీరో మంచు విష్ణు క్లాప్ కొట్టారు.

లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ- ‘‘ఈ కథ విని, చాలా ఎగ్జయిట్ అయ్యా. ఇప్పటి వరకూ నేనెన్నో పాత్రలు చేశా. వాటన్నింటికీ భిన్నంగా తొలిసారి జడ్జి పాత్రలో కనిపించనున్నా’’ అని తెలిపారు. ‘‘కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. కథ కొత్తగా ఉంటుంది’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘ఈ చిత్రంలో లక్ష్మిది పవర్‌ఫుల్ రోల్’’ అని కథ-మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం సునీల్ కశ్యప్, కెమేరా: అంజి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement