‘మా’ ఎన్నికలు: ట్రోలర్స్‌పై మండిపడ్డ మంచు లక్ష్మి | Manchu Lakshmi Fires On Netizens Over Her Tweet About Manchu Vishnu MAA Oath Ceremony | Sakshi
Sakshi News home page

Manchu Lakshmi Prasanna: ట్రోలర్స్‌పై మంచు లక్ష్మి అసహనం

Published Mon, Oct 18 2021 7:49 AM | Last Updated on Mon, Oct 18 2021 11:36 AM

Manchu Lakshmi Fires On Netizens Over Her Tweet About Manchu Vishnu MAA Oath Ceremony - Sakshi

మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్నకు సోషల్‌ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆమె నెటిజన్లపై మండిపడుతూ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె తమ్ముడు మంచు విష్ణు శనివారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం మంచు విష్ణుకు శుభాకాంక్షలు తెలుపుతూ మంచు లక్ష్మి ఓ ట్వీట్‌ చేసింది.

చదవండి: 'మా' ఎన్నికలపై ఆర్జీవీ సెటైర్లు.. ట్వీట్‌ వైరల్‌

దీంతో ఆమె ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్స్‌ చేస్తూ ఆమెను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. ట్రోల్స్‌పై స్పందించిన లక్ష్మి నెటిజన్లకు క్లాస్‌ పీకుతూ మరో ట్వీట్‌ చేసింది. అసలు ఏం జరిగిందంటే.. మంచు విష్ణు ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘ఈ రోజు అత్యంత శుభదినం. ‘మా’ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా నా తమ్ముడు మంచు విష్ణు ప్రమాణ స్వీకారం. ప్రపంచాన్ని మార్చేందుకు ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించే ఈ కొత్త ప్రయాణానికి ఆల్‌ ద బెస్ట్‌. నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఎలాంటి మార్పులు తీసుకొస్తావో చూస్తుంటాను’ అంటూ రాసుకొచ్చింది.

చదవండి: వివాదంలో పెళ్లి సందD హీరోయిన్‌.. ఆమె నా కూతురు కాదంటూ..

దీంతో ఆమె ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్‌ చేయడం ప్రారంభించారు. ‘ఓ ‘మా’ అధ్యక్షుడు ప్రపంచాన్ని ఎలా మార్చగలడు’ అంటూ కామెంట్స్‌ చేశారు. తన ట్వీట్‌పై వస్తున్న కామెంట్స్‌కు మంచు లక్ష్మి స్పందిస్తూ నెటిజన్లపై అసహనం వ్యక్తం చేసింది. ‘ఇక చాలు ఆపండి. ఎప్పుడు చాన్స్ వస్తుందా.. ఎవరిని ఎప్పుడు, ఎలా కామెంట్ చేద్దామా? అని చూస్తుంటారు. నటీ నటులకు సినిమానే ప్రపంచం. విషయాన్ని అర్థం చేసుకోండి. నా ఉద్దేశం మీరనుకునే ప్రపంచం కాదు. ‘మా’ అసోసియేషన్ అనే ప్రపంచాన్ని మార్చడం’’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement